అమెరికా విమానంలో ఆఫ్ఘాన్ వ్యక్తి డెడ్‌బాడీ

ABN , First Publish Date - 2021-08-18T09:25:02+05:30 IST

రెండు రోజుల క్రితం ఆఫ్ఘనిస్తాన్ పూర్తి స్థాయిలో తాలిబన్ల ఆక్రమణలోకి వెళ్లిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే భారత్, అమెరికా వంటి దేశాలు..

అమెరికా విమానంలో ఆఫ్ఘాన్ వ్యక్తి డెడ్‌బాడీ

రెండు రోజుల క్రితం ఆఫ్ఘనిస్తాన్ పూర్తి స్థాయిలో తాలిబన్ల ఆక్రమణలోకి వెళ్లిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే భారత్, అమెరికా వంటి దేశాలు ఆఫ్ఘనిస్తాన్‌లోని తమ ప్రజలను సురక్షితంగా విమానాల ద్వారా తరలించాయి. అమెరికాకు చెందిన సీ-17 విమానం కాబూల్ విమానాశ్రయం నుంచి సోమవారం అక్కడి బయలుదేరింది. భీతావహులైన ఆఫ్ఘన్ పౌరులు 600 మందిని అమెరికాకు తీసుకెళ్లేందుకు బయలుదేరింది. అయితే విమానం బయట వేల మంది ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు ఆ విమానం వెంటపడ్డారు. విమానం రెక్కలపై, చక్రాల వద్ద ఇరుక్కుని వెళ్లేందుకు ప్రయత్నించారు.


ఈ క్రమంలోనే మంగళవారం అమెరికాలో ల్యాండ్ అయిన సీ-17 విమానం ల్యాండింగ్ గేర్‌లో ఓ ఆఫ్ఘనిస్తాన్ వ్యక్తి మృతదేహం కనుగొన్నట్లు అమెరికా అధికార వర్గాలు వెల్లడించాయి. విమానం ల్యాండింగ్ గేర్ పైకి పోలేదని, కారణం ఏమయ్యుంటుందని పరిశీలించగా.. వీల్ వెల్(చక్రం కోసం ఏర్పాటు చేసిన ఖాళీ)లో మృతదేహం లభ్యమైందని వెల్లడించారు.


ఇదిలా ఉంటే తాలిబన్లు ఆఫ్ఘన్ దేశాన్ని హస్తగతం చేసుకున్న తరువాత అక్కడి ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. అమెరికా, భారత్ వంటి దేశాలు తమ ప్రజలను సురక్షితంగా తీసుకెళ్లేందుకు ఏర్పాటు చేసిన విమానాల్లో తమను కూడా తీసుకెళ్లాలని కోరారు. అమెరికా కొందరిని తీసుకెళ్లగా.. ఇంకా వేల మంది ఆ దేశంలోనే ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని జీవిస్తున్నారు.

Updated Date - 2021-08-18T09:25:02+05:30 IST