అప్ఘానిస్తాన్: బాలికల రక్షణకు స్కూలు రికార్డులు దహనం

ABN , First Publish Date - 2021-08-22T17:20:41+05:30 IST

ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ల అరాచకాలు కొనసాగుతున్నాయి....

అప్ఘానిస్తాన్: బాలికల రక్షణకు స్కూలు రికార్డులు దహనం

కాబుల్: ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ల అరాచకాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా మహిళలు, యువతులు, బాలికల విషయంలో తాలిబన్లు మరింత కర్కశంగా వ్యవహరిస్తుంటానే వార్తలు తరచుగా వినిపిస్తుంటాయి. ఇటువంటి పరిస్థితుల్లో దేశంలోని ఏకైక బాలికల పాఠశాల సోలా(స్కూల్ ఆఫ్ లీడర్‌షిప్ అఫ్ఘానిస్తాన్) నిర్వహకులు తమ పాఠశాలలోని విద్యార్థినులందరి రికార్డులు దహనం చేశారు. 


20 ఏళ్ల క్రితం తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్‌ను ఆక్రమించుకున్నప్పుడు బాలికలు పాఠశాలలకు వెళ్లకుండా అడ్డుకున్నారు. ఇంతేకాదు బాలికల రికార్డులను కూడా తగులబెట్టేశారు. ఇప్పుడు రెండు దశాబ్దాల తరువాత తిరిగి తాలిబన్లు అఫ్ఘానిస్తాన్‌ను ఆక్రమించుకున్నారు. తిరిగి వారు స్కూళ్లపై దృష్టి సారించారు. ఈ నేపధ్యంలో ఆ పాఠశాల వ్యవస్థాపకులు షబనా బాసిజ్ రాషిఖ్ విద్యార్థినుల దస్తావేజులను తగులబెట్టేశారు. ఈ సందర్భంగా షబనా తన ట్విట్టర్‌‌ఖాతాలో... విద్యార్థినుల కుటుంబాలను కాపాడేందుకే వారి రికార్డులను దహనం చేశామని తెలిపారు.

Updated Date - 2021-08-22T17:20:41+05:30 IST