తాలిబన్ల తీరును వెల్లడించిన కాబుల్ మహిళా జర్నలిస్టు!

ABN , First Publish Date - 2021-08-19T13:57:36+05:30 IST

తాలిబన్ల పాలనలోకి అఫ్ఘానిస్తాన్ వెళ్లిపోయిన నేపధ్యంలో...

తాలిబన్ల తీరును వెల్లడించిన కాబుల్ మహిళా జర్నలిస్టు!

న్యూఢిల్లీ: తాలిబన్ల పాలనలోకి అఫ్ఘానిస్తాన్ వెళ్లిపోయిన నేపధ్యంలో కాబుల్‌లో చిక్కుకుపోయిన భారతీయ జర్నలిస్టు కనికా గుప్తాతో పాటు 120 మందికిపైగా భారతీయులను సురక్షితంగా ఇండియాకు తీసుకువచ్చారు. స్వదేశానికి వచ్చిన మహిళా జర్నలిస్టు కనికా మీడియాకు తాలిబన్ల తీరు గురించి వెల్లడించారు. అఫ్ఘానిస్తాన్‌ను తాలిబన్లు ఆక్రమించిన అనంతరం తాను ఎదుర్కొన్న అనుభవాలను వివరించారు. 


తాను అక్కడి దుర్భర పరిస్థితులను ప్రత్యక్షంగా చూశానని, వాటిని చెప్పేటప్పుడు కూడా వణుకు వస్తుందని అన్నారు. వారు అఫ్ఘనిస్తాన్‌ను ఆక్రమించుకున్నాక శాంతియుత వాతావరణం నెలకొల్పుతామని చెప్పారన్నారు. అయితే వారు తమను ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు అనుమతివ్వలేదని, అటువంటి పరిస్థితిలోనే తాను రిపోర్టింగ్ చేశానని కనికా తెలిపారు. తన ఇంటి కిటికీ నుంచి బయటకు చూడగా, ఉద్రిక్త వాతావరణం కనిపించిందన్నారు. అక్కడి పరిస్థితులను గమనించిన కొందరు ప్రజలు ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారన్నారు. గడచిన రెండు నెలల్లో అఫ్ఘానిస్తాన్‌లో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని తెలిపారు. అక్కడ సెలూన్లను మూసివేశారని, బుర్కాలకు మరింత డిమాండ్ పెరిందన్నారు.

Updated Date - 2021-08-19T13:57:36+05:30 IST