తొలి రోజు బౌలర్ల జోరు

ABN , First Publish Date - 2021-03-03T09:35:03+05:30 IST

రెండు టెస్ట్‌ల సిరీ్‌సలో భాగంగా అఫ్ఘానిస్థాన్‌-జింబాబ్వే జట్ల మధ్య మంగళవారం మొదలైన ఆరంభ మ్యాచ్‌లో తొలి రోజు బౌలర్ల హవా కొనసాగింది. బ్లెసింగ్‌ ముజరబాని (4/48), విక్టర్‌ న్యూచి (3/34) విజృంభణతో..

తొలి రోజు బౌలర్ల జోరు

  • అఫ్ఘాన్‌ 131 ఆలౌట్‌ 
  • జింబాబ్వే 133/5

అబుదాబి: రెండు టెస్ట్‌ల సిరీ్‌సలో భాగంగా అఫ్ఘానిస్థాన్‌-జింబాబ్వే జట్ల మధ్య మంగళవారం మొదలైన ఆరంభ మ్యాచ్‌లో తొలి రోజు బౌలర్ల హవా కొనసాగింది. బ్లెసింగ్‌ ముజరబాని (4/48), విక్టర్‌ న్యూచి (3/34) విజృంభణతో.. అఫ్ఘాన్‌ తొలి ఇన్నింగ్స్‌లో 131 పరుగులకే కుప్పకూలింది. అప్సర్‌ జజాయ్‌ (37), ఇబ్రహీం జద్రాన్‌ (31) టాప్‌ స్కోరర్లు. డొనాల్డ్‌ తిరిపనో, సీన్‌ విలియమ్స్‌, సికిందర్‌ రజా తలో వికెట్‌ తీశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌లో ఆటచివరకు జింబాబ్వే 133/5 స్కోరు చేసింది. కెప్టెన్‌ విలియమ్స్‌ (54 బ్యాటింగ్‌) అర్ధ సెంచరీతో రాణించాడు. అమీర్‌ హంజా 4 వికెట్లు తీశాడు. 


Updated Date - 2021-03-03T09:35:03+05:30 IST