ఆఫ్ఘనిస్థాన్‌లో సీనియర్ అల్‌ఖైదా నేత హతం

ABN , First Publish Date - 2020-10-25T12:52:52+05:30 IST

మోస్ట్ వాంటెడ్ అల్ ఖైదా సీనియర్ ఉగ్రవాదిని ఆఫ్ఘనిస్థాన్ ప్రత్యేక భద్రతా దళం కాల్చి చంపిందని...

ఆఫ్ఘనిస్థాన్‌లో సీనియర్ అల్‌ఖైదా నేత హతం

కాబూల్ (ఆఫ్ఘనిస్థాన్): మోస్ట్ వాంటెడ్ అల్ ఖైదా సీనియర్ ఉగ్రవాదిని ఆఫ్ఘనిస్థాన్ ప్రత్యేక భద్రతా దళం కాల్చి చంపిందని ఆ దేశ ఇంటెలిజెన్సు సర్వీస్ తాజాగా ప్రకటించింది. భారత ఉప ఖండంలోని ఇస్లామిస్ట్ టెర్రరిస్టు గ్రూపునకు నంబర్ టూగా భావిస్తున్న ఈజిప్టు  జాతీయుడు అబూ హుహిసన్ అల్ మస్రీని మధ్య ఘజ్ని ప్రావిన్సులో హతమార్చినట్లు ఆఫ్ఘనిస్తాన్ జాతీయ భద్రతా డైరెక్టరేట్ ట్వీట్‌లో పేర్కొంది. ఈ ఆపరేషన్ ఎప్పుడు ఎలా జరిగిందనేది వివరాలు అందించలేదు. 


హుసామ్ అబ్దుల్ రవూఫ్ పేరుతో అల్ మస్రీ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల జాబితాలో ఉన్నారు. ఓ విదేశీ ఉగ్రవాద సంస్థకు మద్ధతు  ఇవ్వడంతోపాటు దానికి వనరులను అందించి  అమెరికా పౌరులను చంపడానికి కుట్ర పన్నాడని అల్ మస్రీ అరెస్టుకు యూఎస్ 2018 డిసెంబరులో వారెంట్ జారీ చేసింది. తాలిబాన్, ఆఫ్ఘన్ ప్రభుత్వాల మధ్య ఖతార్ లో శాంతి చర్చలు జరుగుతున్న తరుణంలో ఉగ్రవాది అల్ మస్రీ హత్య జరిగింది.

Updated Date - 2020-10-25T12:52:52+05:30 IST