ఏఎఫ్‌సీ ఆసియా కప్‌-2027కు భారత్‌ బిడ్‌ దాఖలు

ABN , First Publish Date - 2020-04-06T09:32:41+05:30 IST

భారత్‌ మరో మెగా ఈవెంట్‌ ఆతిథ్యానికి సై అంటోంది. ప్రతిష్ఠాత్మక ఏఎఫ్‌సీ ఆసియా ఫుట్‌బాల్‌ కప్‌-2027 పురుషుల టోర్నీకి బిడ్‌ దాఖలు చేసింది...

ఏఎఫ్‌సీ ఆసియా కప్‌-2027కు భారత్‌ బిడ్‌ దాఖలు

న్యూఢిల్లీ: భారత్‌ మరో మెగా ఈవెంట్‌ ఆతిథ్యానికి సై అంటోంది. ప్రతిష్ఠాత్మక ఏఎఫ్‌సీ ఆసియా ఫుట్‌బాల్‌ కప్‌-2027 పురుషుల టోర్నీకి బిడ్‌ దాఖలు చేసింది. బిడ్‌కు సంబంధించిన పత్రాలను నిర్వాహక ఆసియా ఫుట్‌బాల్‌ కాన్ఫడరేషన్‌ (ఏఎఫ్‌సీ)కు అధికారికంగా అందజేసినట్టు ఆలిండియా ఫుట్‌బాల్‌ సమాఖ్య (ఏఐఎఫ్‌ఎఫ్‌) ప్రధాన కార్యదర్శి కుశాల్‌ దాస్‌ ఆదివారం వెల్లడించారు. బిడ్‌ గెలిస్తే.. ఈ ఖండాంతర మెగా ఈవెంట్‌కు భారత్‌ ఆతిథ్యమివ్వడం తొలిసారి కానుంది. నాలుగేళ్లకోసారి నిర్వహించే ఏఎఫ్‌సీ కప్‌కు నిరుడు యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) ఆతిథ్యమివ్వగా.. 2023 టోర్నీ చైనాలో జరగనుంది. కాగా.. 2027 ఆతిథ్య హక్కులను ఎవరు గెలుచుకున్నారన్నది ఏఎఫ్‌సీ వచ్చే ఏడాది ఆరంభంలో ప్రకటించనుంది. 2022లో జరిగే మహిళల ఏఎఫ్‌సీ ఆసియా కప్‌ ఆతిథ్య హక్కులను ఇప్పటికే భారత్‌ దక్కించుకున్న సంగతి తెలిసిందే.  

Updated Date - 2020-04-06T09:32:41+05:30 IST