ఏరోస్పేస్‌, వీఈఎం టెక్నాలజీస్‌ మరో మైలురాయి

ABN , First Publish Date - 2021-07-27T06:10:47+05:30 IST

భారత సాయుధ బలగాల అవసరాల కోసం మొట్టమొదటి

ఏరోస్పేస్‌, వీఈఎం టెక్నాలజీస్‌ మరో మైలురాయి
సమావేశంలో మాట్లాడుతున్న హెచ్‌ఏఎల్‌ చైర్మన్‌ మాధవన్‌

  • తేజస్‌ విడిభాగాల తయారీలో ముందడుగు
  • హిందుస్థాన్‌ ఏరోనాటికల్‌ చైర్మన్‌ మాధవన్‌


మహేశ్వరం: భారత సాయుధ బలగాల అవసరాల కోసం మొట్టమొదటి యుద్ధ విమానం(తేజ్‌స)లో ముఖ్య విడిభాగాన్ని తయారు చేసి ఏరోస్పేస్‌, డిఫెన్స్‌ కంపెనీ వీఈఎం మరో మైలురాయిని అధిగమించిందని హిందుస్థాన్‌ ఏరోనాటికల్‌ చైర్మన్‌ మాధవన్‌ అన్నారు. సోమవారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిరాలలోని ‘వెమ్‌’ కంపనీలో సెంటర్‌ ఫ్యూజ్‌లేజ్‌ ఆఫ్‌ కంబాట్‌ ఎయిర్‌ క్రాఫ్ట్‌(ఎల్‌సీఎ) తేజస్‌ ప్రారంభ కార్యక్రమంలో హెచ్‌ఏఎల్‌ చైర్మన్‌ మాధవన్‌ మాట్లాడుతూ.. మిలటరీ, ఏర్‌క్రాఫ్ట్‌ తుది అంగీకారానికి బాధ్యత వహించిన వీఈఎం టెక్నాలజీస్‌ అంకితభావంతో పనిచేసి అర్హత సాధించిందన్నారు. తేలికపాటి యుద్ధవిమానం తేజ్‌సలో ముఖ్య విడిభాగం ఇక్కడ రూపుదిద్దుకోవడం మన రాష్ర్టానికి, దేశానికి గర్వకారణమన్నారు. తెలంగాణ రాష్ట్రం విమానయాన, క్షిపణి వ్యవస్థలకు కేంద్రంగా మారిందని తెలిపారు. సీఎ్‌ఫఎల్‌ అసెంబ్లింగ్‌ టెస్టింగ్‌ను విజయవంతం చేయడాన్ని ప్రశంసించారు. కార్యక్రమంలో హెచ్‌ఏఎల్‌ ఎల్‌సీఏ డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ ఈపీ జయదేవ్‌, అరుణ్‌జె సర్కాటే, వీఈఎం టెక్నాలజీస్‌ సీఎండీ వెంకట్‌రాజు పాల్గొన్నారు.



Updated Date - 2021-07-27T06:10:47+05:30 IST