ఎగిరిపోతే.. ఎంత బాగుంటుంది.

ABN , First Publish Date - 2022-07-04T06:28:56+05:30 IST

ఎగిరిపోతే ఎంత బావుం టుంది..ఇదే ప్రతి ఒక్కరి ఆలోచన..

ఎగిరిపోతే.. ఎంత బాగుంటుంది.
మఽధురపూడి విమానాశ్రయం

విమాన ప్రయాణానికి పెరుగుతున్న డిమాండ్‌

మధురపూడి నుంచి ఇండిగో సర్వీసులు

రోజుకు సుమారు 1400 మంది ప్రయాణం

ప్రధాన పట్టణాలకు రోజూ విమానయానం

డబ్బు ఖర్చయినా.. సమయం ఆదా

గంటన్నరలోనే హైదరాబాద్‌..చెన్నై


చెన్నైకి రైలులో వెళితే సుమారుగా  10 గంటల పైగానే ప్రయాణం.. ఏసీ టూటైర్‌లో  వెళితే రూ. 1700.. అదే విమానంలో వెళితే కేవలం గంటన్నరలో గమ్యస్థానం చేరిపోవచ్చు. చార్జి సుమారు రూ.4 వేలు...


హైదరాబాద్‌కు రైలులో వెళితే సుమారు 8 గంటల ప్రయాణం.. అదే విమానంలో అయితే గంట ప్రయాణం.. టిక్కెట్‌ ధర అటూ ఇటూగా ఉంటుంది. దీంతో చాలా మంది విమాన ప్రయాణానికే మొగ్గు చూపుతున్నారు. 


ప్రస్తుతం అంతా బిజీ బిజీ జీవితం.. క్షణం తీరిక ఉండదు.. నిమిషం ఖాళీ ఉండదు.. ఉరుకుల పరుగుల జీవితమే.. కాలంతో పాటు మనిషి పరుగెడుతూనే ఉన్నాడు.. ప్రయాణంలోనూ అదే పరుగు.. ఎంత ఖర్చవుతుందనే దానికంటే ఎలా వెళితే సమయం కలిసి వస్తుందనేదే ఆలోచిస్తున్నాడు. ఇదే విమానయానానికి కలిసివచ్చింది.. రాజమహేంద్రవరంలోని మధురపూడి విమానాశ్రయం నుంచి రోజుకు సుమారు 1400 మంది ప్రయాణిస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు. 


మధురపూడి, జూలై 3 : ఎగిరిపోతే ఎంత బావుం టుంది..ఇదే ప్రతి ఒక్కరి ఆలోచన..గతంలో విమానం పెద్దోడి ప్రయాణ సాధనం. మరి నేడు విమానం దారి మారిపో యింది..కాలంతో పాటు పేదోడికి అందుబాటులోకి వచ్చేసింది. అత్యవసరమైతే విమానప్రయాణానికి ఎవరూ వెనుకాడడం లేదు.సాఫ్ట్‌వేర్‌ రంగంలో ఉభయగోదావరి జిల్లాల నుంచి ఎంతో మంది ఉండడం విమానయానానికి కలిసొచ్చింది. దీంతో మఽధురపూడి విమానశ్రయానికి రోజురోజుకు ప్రయాణి కుల సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుతం రోజుకు సుమారు 1400 మంది ప్రయాణిస్తున్నట్టు సమాచారం.  


సుందరంగా విమానాశ్రయం..


 ఉమ్మడి ఉభయగోదావరికి కేంద్రంగా ఉన్న రాజమహేంద్రవరం విమానాశ్రయం రోజు రోజుకు ఆధునిక వసతులతో సుందరంగా రూపుదిద్దుకుంటోంది. ప్రయాణికుల సంఖ్య పెర గడంతో వసతులు పెంచారు.  ప్రతిరోజూ హైదరాబాద్‌, బెంగుళూరు, విశాఖపట్నం నగరాలకు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9.40 గంటల వరకూ విమానాలు రాకపోకలు సాగుతున్నాయి. రోజు విడిచి రోజు తిరుపతి, చెన్నై నగరాలకు రాజమహేంద్రవరం విమానాశ్రయం నుంచి ఇండిగో విమానాలు నడుస్తున్నాయి. కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టినప్పటికీ నియంత్రణ చర్యలు చేపడుతున్నారు.


పెరుగుతున్న ప్రయాణికులు


విమానాశ్రయానికి ప్రయాణికుల తాకిడి పెరిగింది. గతం తో చూస్తే ప్రస్తుతం విమాన ప్రయాణం పట్ల ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. బిజీ సమయంలో సమయాన్ని వృథా చేసు కోకుండా  ఉండేందుకు టిక్కెట్‌ ధరలు అధికంగా ఉన్నప్ప టికి  ఖర్చుకు వెనకాడకుండా ప్రయాణం వైపు మక్కువ చూపుతున్నారు. రాజమండ్రి విమానాశ్రయం గడచిన ఐదారు నెలల్లో ప్రయాణికుల సంఖ్య దాదాపు మూడు రెట్లు పెరిగి నట్టు అధికారులు తెలిపారు.ఇతర సర్వీసులపై ఆధారపడి హైదరాబాద్‌, బెంగళూరు, విశాఖపట్నం, తిరుపతి, చైన్నైలకు ప్రయాణించాలంటే రెండు మూడు రోజులు సమయం పట్ట డంతో పాటు రిజర్వేషన్లు ఖచ్చితంగా దొరుకుతాయనే గ్యారంటీ లేదు.దీంతో ప్రయాణికులు విమాన ప్ర యాణాన్ని ఎంచుకుంటున్నారు. రాజమండ్రి విమానాశ్రయం నుంచి ప్రతి రోజు సుమారు 1400 మంది  ప్రయాణిస్తున్నట్టు విమానా శ్రయం అధికారులు తెలిపారు. 


విమాన సమయాలివే..


ఇండిగో సర్వీసులు ఉదయం నుంచి హైదరాబాద్‌, బెం గళూరు, విశాఖపట్నం,తిరుపతి, చైన్నైలకు రాత్రి 9:40 గంటల వరకు అందుబాటులో ఉన్నాయి.రాజమహేంద్రవరం విమానాశ్రయం నుంచి హైదరాబాద్‌కు ఉదయం 9.15 గంటలకు, మఽధ్యాహ్నం 12.55, సాయంత్రం 5.10, రాత్రి 9.40, బెంగళూరుకు ఉదయం 8.55, రాత్రి 8 గంటలకు, విశాఖపట్నం సాయంత్రం 5.40, రోజు విడిచి రోజు ప్రయాణించే విమానాలు తిరుపతి ఉదయం 8.55, చెన్నై మధ్యాహ్నం 12.15, రాత్రి 7.30 గంటల వరకూ రాకపోకలు సాగిస్తున్నాయి.దీంతో ప్రయా ణికులు విమానయానానికిఆసక్తి చూపుతున్నారు. 


ట్విట్టర్‌ యాప్‌లో విమాన సమాచారం


హైదరాబాద్‌, బెంగళూరు, విశాఖపట్నం, తిరుపతి, చెన్నై నగరాల రాకపోకలకు ప్రస్తుతం ఇండిగో విమానాలు మాత్రమే అందుబాటులో ఉన్నట్టు ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌ మనోజ్‌కుమార్‌ నాయక్‌ తెలిపారు. ప్రతి        రోజూ విమాన రాకపోకలు తెలియాలంటే ట్విట్టర్‌ యాప్‌లో సమాచారం అందుతుంది.


Updated Date - 2022-07-04T06:28:56+05:30 IST