న్యాయదేవతపై నిఘా కథనంపై లాయర్ శ్రవణ్‌కుమార్ ఏమన్నారంటే..

ABN , First Publish Date - 2020-08-15T19:05:31+05:30 IST

న్యాయదేవతపై నిఘా పేరుతో ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో ప్రసారం అయిన పరిశోధనాత్మక కథనం ఆధారంగా హైకోర్టులో సోమవారం ప్రజాప్రయోజన వ్యాజ్యం

న్యాయదేవతపై నిఘా కథనంపై లాయర్ శ్రవణ్‌కుమార్ ఏమన్నారంటే..

విజయవాడ: న్యాయదేవతపై నిఘా పేరుతో ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో ప్రసారం అయిన పరిశోధనాత్మక కథనం ఆధారంగా హైకోర్టులో సోమవారం ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేయనున్నట్లు న్యాయవాది శ్రవణ్‌కుమార్ తెలిపారు. ఏబీఎన్‌తో ఆయన మాట్లాడారు. ఎవరి ఫోన్ అయిన ట్యాంపరింగ్ చేయాలన్న దానికి తగ్గ కారణాలు ఉండాలని వెల్లడించారు. చాలా మంది న్యాయమూర్తుల ఫోన్‌లను ట్యాంపరింగ్ చేయడం ద్వారా ఆ వ్యవస్థను నియంత్రణ చేయాలని చూస్తున్నారన్న అనుమానులు కల్గుతున్నాయని ఆరోపించారు. నిఘా వ్యవస్థలు ద్వారా లేదా 3వ పార్టీ ద్వారా ట్యాప్ చేయిస్తున్నారన్న అనుమానాలు కూడా ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఇదే నిజమని తేలితే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆర్టికల్ 356 ప్రకారం బర్త‌రఫ్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. 

Updated Date - 2020-08-15T19:05:31+05:30 IST