అడ్వకేట్‌ హన్మంతరెడ్డి మృతి తీరని లోటు

ABN , First Publish Date - 2022-08-08T05:30:00+05:30 IST

అడ్వకేట్‌ హన్మంతరెడ్డి మృతి తీరని లోటు

అడ్వకేట్‌ హన్మంతరెడ్డి మృతి తీరని లోటు
హన్మంత్‌రెడ్డి ఫొటోకు నివాళి అర్పిస్తున్న బార్‌ అసోసియేషన్‌ సభ్యులు

వికారాబాద్‌, ఆగస్టు 8: సీనియర్‌ న్యాయవాది హన్మంతరెడ్డి మృతి తీరని లోటు అని వికారాబాద్‌ బార్‌ అసోసియేషన్‌ సభ్యులు అన్నారు. సోమవారం జిల్లా బార్‌ ఆధ్వర్యంలో హన్మంతరెడ్డి ఫొటోకు నివాళులు అర్పించారు. వారు మాట్లాడుతూ.. జిల్లా కోర్టు సీనియర్‌ లాయర్‌ హఠాన్మరణం బాధాకరం అ న్నారు. అందరినీ కలుపుకొని పోయే మృదుస్వభావి హన్మంతరెడ్డి అని కొని యాడారు. ఆయన మృతికి మౌనం పాటించి 12:30 నిమిషాల వరకు కోర్టులో విధులు నిలిపి సంతాపం వ్యక్తం చేశారు. బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు మాధవరెడ్డి, ప్రధాన కార్యదర్శి జగన్‌, గోపాల్‌రెడ్డి, యాదవరెడ్డి, వసుంధర, అనిల్‌కుమార్‌, రఫీ, శంకరయ్య, బస్వరాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-08T05:30:00+05:30 IST