పిట్ట కొంచెం.. కూత ఘనం

ABN , First Publish Date - 2022-03-22T16:02:49+05:30 IST

అపరిమిత జ్ఞాపకశక్తితో రెండేళ్ల బాలుడు పలు రికార్డులు నెలకొల్పాడు. విరుదునగర్‌ జిల్లా శివకాశికి చెందిన రామకృష్ణన్‌-సత్య దంపతుల రెండవ కుమారుడు ఆద్విక్‌కుమార్‌ (2). చిన్నారి..

పిట్ట కొంచెం.. కూత ఘనం

అపరిమిత జ్ఞాపకశక్తితో రికార్డులకెక్కిన బుడతడు

చెన్నై, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): అపరిమిత జ్ఞాపకశక్తితో రెండేళ్ల బాలుడు పలు రికార్డులు నెలకొల్పాడు. విరుదునగర్‌ జిల్లా శివకాశికి చెందిన రామకృష్ణన్‌-సత్య దంపతుల రెండవ కుమారుడు ఆద్విక్‌కుమార్‌ (2). చిన్నారి ఏడాది వయస్సులోనే ఇంట్లో జరుగుతున్న విషయాలు గమనించి కొద్దికాలం అనంతరం మళ్లీ వాటిని తెలియజేసేలా జ్ఞాపకశక్తి కలిగి ఉన్నాడని తల్లిదండ్రులు గుర్తించారు. చిన్నారి ఆద్విక్‌కు అప్పటి నుంచే నేతలు, వివిధ దేశాల చిహ్నాలు, జాతీయ పతకాలు, మ్యాప్‌లు జంతువులు, పక్షులు తదితరాల గురించి తల్లిదండ్రులు తెలియజేసేవారు.


ఏ క్షణంలోనైనా ఏ వస్తువు, చిత్రం చూపించినా చిన్నారి టక్కున సమాధానం చెప్పేవాడు. ఆ రీతితో ఒకట్నిర నుంచి ఆరు నెలల కాలంలో ఆద్విక్‌ సుమారు 20కి పైగా రికార్డులు సృష్టించాడు. గత నెలలో నిర్వహించిన కార్యక్రమంలో 3 నిముషాల 32 సెకన్లలో 100 రకాల చిత్రాలు, ఐదుగురు రాజకీయనేతలు, ఆరుగురు జాతీయ నాయకులు, 25 వాహనాల లోగోలు, 10 మంచి అలవాట్లు, ఐదుగురు స్వాతంత్య్ర సమరయోధులు, 28 రకాల జంతువులు, 15 రకాల పక్షులు, 30 రకాల ఆహార పదార్ధాల పేర్లు చెప్పి జాకీ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో స్థానం దక్కించుకున్నాడు. 

Updated Date - 2022-03-22T16:02:49+05:30 IST