ఆర్టీసీ బస్సులలో ముందస్తు రిజర్వేషన్‌ వ్యవధి పొడగింపు

ABN , First Publish Date - 2021-12-02T00:54:23+05:30 IST

దూరప్రాంతాలకు ముందస్తు రిజర్వేషన్‌ (అడ్వాన్స్‌ రిజర్వేషన్‌) చేసుకునే సమయాన్ని ఏపీఎస్‌ఆర్‌టీసీ పొడిగించింది.

ఆర్టీసీ బస్సులలో ముందస్తు రిజర్వేషన్‌ వ్యవధి పొడగింపు

విజయవాడ: దూరప్రాంతాలకు ముందస్తు రిజర్వేషన్‌ (అడ్వాన్స్‌ రిజర్వేషన్‌) చేసుకునే సమయాన్ని ఏపీఎస్‌ఆర్‌టీసీ పొడిగించింది. ప్రయాణికుల సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు ఈ మేరకు బుధవారం నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప, అనంతపురం వంటి దూర ప్రాంతాలకు ముందస్తు రిజర్వేషన్‌ చేసుకోవటానికి ఇప్పటి వరకు ముప్పై రోజుల వ్యవధి మాత్రమే ఉంది. నేటి నుంచి (డి సెంబర్‌ 2) ఈ వ్యవధిని 60 రోజులకు పెంపుదల చేసింది. క్రిస్‌మస్‌, నూతన సంవత్సరం, సంక్రాంతి పర్వదినాలను దృష్టిలో ఉంచుకుని ప్రయాణీకుల సౌలభ్యం కోసం ఆర్టీసీ ఎండీ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.  

Updated Date - 2021-12-02T00:54:23+05:30 IST