పెద్దలు పిల్లల్లా...

ABN , First Publish Date - 2021-03-30T05:46:03+05:30 IST

అటెన్షన్‌ డెఫిసిట్‌ హైపర్‌యాక్టివిటీ డిజార్డర్‌ (ఎ.డి.హెచ్‌.డి) పిల్లలకే పరిమితం కాదు. ఈ సమస్య పెద్దలనూ వేధిస్తుంది. బాల్యంలో ఈ సమస్య బారిన పిల్లల్లో పెద్దయ్యాక కూడా ఇదే సమస్య తలెత్తే అవకాశాలు ఎక్కువ

పెద్దలు పిల్లల్లా...

అటెన్షన్‌ డెఫిసిట్‌ హైపర్‌యాక్టివిటీ డిజార్డర్‌ (ఎ.డి.హెచ్‌.డి) పిల్లలకే పరిమితం కాదు. ఈ సమస్య పెద్దలనూ వేధిస్తుంది. బాల్యంలో ఈ సమస్య బారిన పిల్లల్లో పెద్దయ్యాక కూడా ఇదే సమస్య తలెత్తే అవకాశాలు ఎక్కువ. పెద్దల్లో ఈ సమస్యను తెలిపే లక్షణాలు ఇవే!

ఏకాగ్రతాలోపం: సంభాషణలో, లేదా ఏదైనా పని చేస్తున్నప్పుడు తేలికగా ఏకాగ్రత కోల్పోతూ, వేరే విషయాల వైపు మళ్లిపోతూ ఉంటారు. 

అమరిక లోపాలు: చిన్న చిన్న విషయాల్లో అమరిక, కూర్పు లోపిస్తూ ఉంటుంది. ఉదాహరణకు ఆఫీసు టేబుల్‌ మీద పెన్‌ స్టాండ్‌, పుస్తకాల అమరిక వారికి సమస్యగా మారవచ్చు. చిన్న చిన్న పొరపాట్లు దొర్లుతూ చీకాకుకు గురి చేస్తూ ఉండవచ్చు.

టైమ్‌ మేనేజ్‌మెంట్‌: సమయానికి పనులు పూర్తి చేయలేకపోవడం, ఆలస్యంగా చేరుకోవడం, పనుల పట్ల అశ్రద్ధ, ప్రణాళికాబద్ధంగా నడుచుకోలేపోవడం లాంటి ఇబ్బందులు కూడా తలెత్తుతాయి.

అసహనం: ఈ సమస్య ఉన్న వ్యక్తులు ఏ ఒక్క ప్రదేశంలో కుదురుగా కొద్దిసేపు కూర్చోలేరు. అలాగే కొద్దిసేపు కూడా ఒకే చోట విశ్రాంతి తీసుకోలేరు.

మతిమరుపు: మతిమరుపు పెద్దల్లో సహజమే అయినా, ఎడిహెచ్‌డి ఉన్న వ్యక్తులు అతి ముఖ్యమైన విషయాలు, సందర్భాలు, పనులు కూడా మర్చిపోతూ ఉంటారు. 

చికిత్స: పెద్దల్లో ఎడిహెచ్‌డిని కొన్ని థెరపీలతో నయం చేయవచ్చు. లక్షణాలను నియంత్రించుకునే నియమాల సాధన కూడా ముఖ్యమే! క్రమబద్ధమైన జీవనశైలి, పౌష్టికాహారంతో పాటు ఒత్తిడిని తగ్గించే అలవాట్లు అలవరుచుకోవడం ద్వారా సమస్య నుంచి బయటపడే వీలుంది.

Updated Date - 2021-03-30T05:46:03+05:30 IST