పల్లెల్లో పెద్దల పెత్తనం!

ABN , First Publish Date - 2022-04-28T04:29:35+05:30 IST

జిల్లాలో గ్రామాభివృద్ధి కమిటీల (వీడీసీల) ఆగడాలు రోజురోజుకూ పెరిగిపోతున్న కారణంగా బాఽధితు లు రోడ్డెక్కి ఆందోళనకు దిగుతున్నారు. కొంతకాలం నుంచి గ్రామాభివృ ద్ధి కమిటీలు పెద్దరికం పేరిట అక్రమ వ్యాపారాలను ప్రోత్సాహిస్తూ త మ తీర్పులు, తీర్మానాలను దిక్కరించే వారికి బహిష్కరణల వేటు వేస్తున్నాయి. గ్రామంలోని అన్ని కులాలకు చెందిన ఒక్కో వ్యక్తి ఈ వీడీసీల్లో సభ్యులుగా ఉంటారు. గ్రామ అభివృద్ధి పేరిట ఏర్పడ్డ వీడీసీలు తమ అ సలు లక్ష్యాన్ని విస్మరించి తీర్పులు, తీర్మాణాలతో పాటు ఆదాయాన్ని స మకూర్చడమే లక్ష్యంగా పెట్టుకుంటున్నాయి. ఓరకంగా ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలను సైతం పక్క న పెట్టి పల్లెల్లో స మాంతర పాలన సాగిస్తున్నాయని పలువురు అంటున్నారు. గ్రామ ఐక్యత, అభివృద్ధే ఏజెండా ముసుగులో పల్లెల్లో ఏర్పాటవుతున్న వీడీసీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ తమకు అడ్డుచెప్పే వా రిని మానసిక, సామాజిక, ఆర్థికంగా వేఽధింపులకు గురిచేస్తున్నాయన్న ఆరోపణలున్నాయి.

పల్లెల్లో పెద్దల పెత్తనం!
చెరువుకు గండి కొట్టిన అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని ఆందోళన చేస్తున్న దృశ్యం (ఫైల్‌)

ఊర్లల్లో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న గ్రామాభివృద్ధి కమిటీలు

తీర్పులు, తీర్మానాలతో ఆధిపత్యం  

ప్రశ్నించే వారిపై బహిష్కరణ వేటు 

బెల్ట్‌షాపులు, ఇసుక క్వారీలకు వేలంపాటలు 

ఆదాయం సమకూర్చడమే టార్గెట్‌

నిర్మల్‌, ఏప్రిల్‌ 27 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో గ్రామాభివృద్ధి కమిటీల (వీడీసీల) ఆగడాలు రోజురోజుకూ పెరిగిపోతున్న కారణంగా బాఽధితు లు రోడ్డెక్కి ఆందోళనకు దిగుతున్నారు. కొంతకాలం నుంచి గ్రామాభివృ ద్ధి కమిటీలు పెద్దరికం పేరిట అక్రమ వ్యాపారాలను ప్రోత్సాహిస్తూ త మ తీర్పులు, తీర్మానాలను దిక్కరించే వారికి బహిష్కరణల వేటు వేస్తున్నాయి. గ్రామంలోని అన్ని కులాలకు చెందిన ఒక్కో వ్యక్తి ఈ వీడీసీల్లో సభ్యులుగా ఉంటారు. గ్రామ అభివృద్ధి పేరిట ఏర్పడ్డ వీడీసీలు తమ అ సలు లక్ష్యాన్ని విస్మరించి తీర్పులు, తీర్మాణాలతో పాటు ఆదాయాన్ని స మకూర్చడమే లక్ష్యంగా పెట్టుకుంటున్నాయి. ఓరకంగా ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలను సైతం పక్క న పెట్టి పల్లెల్లో స మాంతర పాలన సాగిస్తున్నాయని పలువురు అంటున్నారు. గ్రామ ఐక్యత, అభివృద్ధే ఏజెండా ముసుగులో పల్లెల్లో ఏర్పాటవుతున్న వీడీసీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ తమకు అడ్డుచెప్పే వా రిని మానసిక, సామాజిక, ఆర్థికంగా వేఽధింపులకు గురిచేస్తున్నాయన్న ఆరోపణలున్నాయి. 

ప్రజాప్రతినిధులంతా డమ్మీలు..

వీడీసీలు గ్రామాల్లో అన్ని తామై వ్యవహరిస్తూ ప్రజాప్రతినిధులను సైతం శాసించే స్థాయికి చేరుకున్నాయంటున్నారు. వీడీసీల ముందు స ర్పంచ్‌లు, ఎంపీటీసీలు బలాదూర్‌ అయ్యారంటున్నారు. వీరు ఇచ్చే తీర్పులకు సర్పంచ్‌లు అడ్డు చెప్పే పరిస్థితి లేదన్న వాదనలున్నాయి. అవ సరమైతే సర్పంచ్‌లకు, ఎంపీటీసీలకు సైతం వీడీసీలు పక్కన పెట్టే వా తావరణాన్ని గ్రామాల్లో కల్పిస్తున్నారంటున్నారు. ఎన్నికల సమయంలో కూడా అన్ని పార్టీలు వీడీసీల కటాక్షం కోసం క్యూ కడుతుంటాయి. 

ఆదాయ వనరులపైనే గురి..

జిల్లాలోని అన్ని గ్రామాల్లో బెల్ట్‌షా పుల ఏర్పాటుకు వీడీసీల పరోక్ష మద్ద తే కారణమంటున్నారు. గ్రామాల్లో బెల్ట్‌షాపులను ఏర్పాటు చేసేందుకు బహిరంగ వేలంపాట నిర్వహిస్తున్నాయి. ఎక్కువ మొత్తానికి పాటపాడిన వ్యక్తి బెల్ట్‌ షాపును దక్కించుకుంటాడు. ప్రస్తుతం జిల్లాలో ప్రతీ పంచాయతీ బెల్ట్‌ షాపులకు లక్షలాది రూపాయల్లో వేలంపాట కొనసాగుతోంది. బెల్ట్‌ షాపులకు వీడీసీలు లైసెన్సు తరహా అనుమతులను సైతం జారీ చేస్తున్నాయంటున్నారు. వీటి అనుమతితో గ్రామంలో మద్యం విక్రయాలు కొనసాగుతున్నప్పటికీ అధికారులు చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నారన్న ఫిర్యాదులున్నాయి. వాగులు, చెరువులకు ఆనుకొని ఉన్న గ్రామాల్లో ఇసుక క్వారీలపై ఆఽధిపత్యం చెలాయిస్తున్నాయి. వీటికి వేలంపాట నిర్వహించి లక్షలా ది రూపాయలు సేకరిస్తున్నాయంటున్నారు. కొన్ని గ్రామాల్లో కూల్‌ డ్రింక్‌ షాపులు, చికెన్‌ సెంటర్‌లకు కూడా వేలంపాట నిర్వహించి నిధు ల సేకరణ కొనసాగిస్తున్నాయన్న విమర్శలున్నాయి.

కలకలం రేపిన న్యూ సాంగ్వి ఘటన..

వీడీసీల ఆధిపత్యానికి మామడ మండలంలోని న్యూ సాంగ్వి గ్రామ ఒడ్డెరులు చెక్‌ పెట్టడం చర్చనీయాంశమవుతోంది. ఈ గ్రామ ఒడ్డెరలను వీడీసీ సభ్యులు అకారణంగా సామాజిక బహిష్కరణకు గురిచేశారన్న ఫిర్యాదులున్న సంగతి తెలిసిందే. ఇక్కడి ఒడ్డెర కులస్థులు తమను అకారణంగా వీడీసీ బహిష్కరించిందంటూ ఆందోళన బాట చేపట్టి అందరి దృష్టిని ఆకర్షించారు. తహసీల్‌ కార్యాలయాన్ని ముట్టడించడమే కాకుండా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. దీంతో యంత్రాంగమంతా దిగి వచ్చి వీడీసీ, ఒడ్డెరులతో చర్చలు జరిపింది. ఒడ్డెర కులస్థులు వీడీసీల సమాంతర పాలనపై రాష్ట్ర మానవ హక్కుల సంఘానికి సైతం ఫిర్యాదు చేశా రు. పోలీసు అధికారులు వీడీసీల చేత ఒడ్డెర కులస్థులకు క్షమాపణలు చెప్పించడమే కాకుండా రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటింపజేశారు. 

మరికొన్ని చోట్ల..

కొద్దిరోజుల క్రితం కడ్తాల్‌ గ్రామంలో ఓ వ్యక్తి మృతికి కారకులయ్యారన్న ఆరోపణతో అక్కడి వీ డీసీ సభ్యులపై కేసు నమోదయ్యింది. లోకేశ్వరం మండలం రాజురా గ్రామంలో కూడా వీడీసీ, మత్స్యకారులకు మధ్య వివాదం కొనసాగుతోంది. ఈ విషయమై గ్రామానికి చెందిన మత్స్యకారులు పలుసార్లు జిల్లా కలెక్టర్‌కు ఫి ర్యాదు చేశారు. సిద్ధిలకుంట గ్రామంలో ఓ దళితుడి భూమి విషయంలో కూడా వీడీసీ జోక్యం చేసుకొ ని ఆయనకు వ్యతిరేకంగా తీ ర్పునివ్వడమే కాకుండా వేధింపులకు కూడా పాల్పడినట్లు ఫి ర్యాదులున్నాయి. మరికొన్ని గ్రా మాల్లో కూడా వీడీసీలు ఇలాం టి చట్ట వ్యతిరేక తీర్పులు ఇ చ్చి పలువురిని వేధింపులకు గురి చేశాయన్న విమర్శలున్నాయి. వీడీసీల ఆధిపత్యాన్ని అటు పోలీసులు, ఇటు పాలకులు అడ్డుకోలేకపోతున్నారనే ఆరోపణలున్నాయి.

  

ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం..

- రామ్‌రెడ్డి, ఏఎస్పీ

గ్రామాల్లో కొనసాగుతున్న వీడీసీలు గ్రామీణాభివృద్ధికి తోడ్పా టును అందించాలే తప్ప చట్టాలను తమ గుప్పిట్లోకి తీసుకోవద్దు. వీడీసీ ఆగడాలపై తమకు ఫిర్యాదు చేస్తే క ఠిన చర్యలు తీసుకుంటాం. క డ్తాల్‌ గ్రామంలో వీడీసీ స భ్యులపై ఇప్ప టికే కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాం.

Updated Date - 2022-04-28T04:29:35+05:30 IST