Chitrajyothy Logo
Advertisement
Published: Tue, 25 Jan 2022 00:31:21 IST

అదృష్టం వరించిందా సఖీ?!

twitter-iconwatsapp-iconfb-icon
అదృష్టం వరించిందా సఖీ?!

కీర్తిసురేష్‌ ప్రధాన పాత్ర పోషించిన చిత్రం ‘గుడ్‌ లక్‌ సఖి’. ఆది పినిశెట్టి, జగపతిబాబు కీలక పాత్రధారులు. నగేష్‌ కుకునూర్‌ దర్శకుడు. వర్త్‌ ఏ షాట్‌ మోషన్‌ ఆర్ట్స్‌ పతాకంపై సుధీర్‌ చంద్ర పదిరి నిర్మించారు. ఈనెల 28న విడుదల అవుతోంది. సోమవారం ట్రైలర్‌ ఆవిష్కరించారు. చిత్తూరు మాండలికంలో.. ఓ పల్లెటూరి పిల్లలా కీర్తి కనిపించింది. కోచ్‌గా జగపతిబాబు, కథానాయికని ప్రోత్సహించే కీలకమైన పాత్రలో ఆది పినిశెట్టి తెరపై సందడి చేశారు. ఇది క్రీడా నేపథ్యంలో సాగే కథ. ఓ దురదృష్టవంతురాలైన పల్లెటూరి అమ్మాయి, షూటింగ్‌లో విజేతగా ఎలా నిలిచింది? అనేదే కథ. దర్శకుడు మాట్లాడుతూ ‘‘జాతీయ ఉత్తమనటిగా గుర్తింపు తెచ్చుకున్న కీర్తి కెరీర్‌లో మరో గొప్ప పాత్ర ఇది. అందులో కీర్తి నటన ఆద్యంతం ఆకట్టుకుంటుంది. అన్ని రకాల ఎమోషన్స్‌ని కీర్తి పండించింది. జగపతిబాబు, ఆదిల పాత్రలు కూడా గుర్తుండిపోతాయి. దేవిశ్రీ ప్రసాద్‌ చక్కటి సంగీతం అందించార’’న్నారు. 


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement