Advertisement
Advertisement
Abn logo
Advertisement

బిట్రగుంటలో ఏడీఆర్‌ఎం విస్తృత తనిఖీలు

బిట్రగుంట, నవంబరు 27: విజయవాడ రైల్వే ఏడీఆర్‌ఎం శ్రీకాంత్‌ శనివారం బిట్రగుంట రైల్వే సెక్షన్‌ పరిధిలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. క్రూ కంట్రోల్‌ రూమ్‌లో రికార్డులు పరిశీలించారు. దక్షణ క్యాబిన్‌ వద్ద జరుగుతున్న ట్రాక్‌ వర్కుపై అధికారులతో చర్చించారు. డ్రైవర్లు, గార్డుల విశ్రాంతి గదులను పరిశీలించి మౌలిక వసతులపై ఆరా తీశారు. ముఖ్యంగా తాగునీరు, భోజనం సక్రమంగా అందుతున్నది లేనిది కార్మికులను అడిగి తెలుసుకున్నారు. రైలు డ్రైవర్లు, గార్డులతో సెమినార్‌ నిర్వహించారు. సిబ్బంది తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచించారు.   వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కరోనాతో నిలిపివేసిన రైళ్లను పునరుద్ధరించాలని, పలు రైళ్లను బిట్రగుంటలో నిలపాలని బిట్రగుంట రైల్వే అభివృద్ధి కమిటీ సభ్యులు షేక్‌.నూరుధ్ధీన్‌, మెతుకు రాజేశ్వరి ఆయనను కోరారు. ఆయన వెంట సీనియర్‌ డీఈ శ్రీనివాసరావు, ఎస్‌ఎస్‌ఈ ప్రసాద్‌, ఏడీఈఎన్‌ సుదర్శన్‌రెడ్డి, బిట్రగుంట ఎస్‌ఎస్‌ మీనాకుమార్‌, క్రూ కంట్రోలర్‌ శేషయ్య, ఐవోడబ్ల్యూ సత్యనారాయణ తదితరులు ఉన్నారు.


Advertisement
Advertisement