ఆదోనిలో ఒకే రోజు 7 కేసులు

ABN , First Publish Date - 2020-05-28T11:32:49+05:30 IST

ఆదోని పట్టణంలో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. బుధవారం జిల్లాలో 8 మందికి కరోనా నిర్ధారణ కాగా ఇందులో

ఆదోనిలో ఒకే రోజు 7 కేసులు

  • జిల్లాలో కొత్తగా 8 మందికి కరోనా
  • 673కు చేరిన బాధితుల సంఖ్య


కర్నూలు(హాస్పిటల్‌), మే 27: ఆదోని పట్టణంలో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. బుధవారం జిల్లాలో 8 మందికి కరోనా నిర్ధారణ కాగా ఇందులో ఏడుగురు ఆదోనికి చెందిన వారే. మిగిలిన ఒక్కరు కర్నూలు నగర వాసి. కేసులు పెరుగుతుండడంతో ఆదోని ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఈ నెల 17వ తేదీ వరకు ఆదోని పట్టణంలో 13 కేసులు ఉండగా 10 రోజులకు రెట్టింపయ్యాయి. దీంతో పాటు ఆదోని డివిజన్‌లోని చిప్పగిరి, ఆలూరు ప్రాంతాల్లో కొత్తగా కేసులు వచ్చాయి. బుధవారం ఆదోని పట్టణం హనుమాన్‌నగర్‌లో ఒకటి, వెంకన్నపేటలో ఒకటి. ఎన్‌జీవో కాలనీలో ఒకటి, ఎంఐజీలో ఒకటి, కిలిచిన్‌పేటలో రెండు, రాజీవ్‌గాంధీనగర్‌లో ఒక కేసు వచ్చాయి. కోయంబేడు వలస కార్మికుల వల్ల ఆదోని ప్రాంతంలో కేసులు అధికమవుతున్నాయి. జిల్లాలో కరోనా బాధితుల సంఖ్య 673కు చేరింది. 


ముగ్గురు డిశ్చార్జి

కర్నూలు జీజీహెచ్‌ స్టేట్‌ కొవిడ్‌ ఆసుపత్రి నుంచి కర్నూలు నగరానికి చెందిన చెందిన ముగ్గురు బుధవారం డిశ్చార్జి అయ్యారు. వీరిలో ఇదరు పురుషులు, ఒక మహిళ ఉన్నారు. దీంతో ఇప్పటివరకు జిల్లాలో కరోనా విజేతలు 576 మంది డిశ్చార్జి అయ్యారు.  

Updated Date - 2020-05-28T11:32:49+05:30 IST