చైను అన్న వేసుకొని వెళ్లాడు.. వచ్చాక తీసుకో అని చెప్పడంతో.. మనస్తాపానికి గురై..

ABN , First Publish Date - 2020-08-07T12:08:46+05:30 IST

శుభకార్యానికి వెళ్లేందుకు బంగారు చైను ఇవ్వాలని తల్లిని ఓ యువకుడు..

చైను అన్న వేసుకొని వెళ్లాడు.. వచ్చాక తీసుకో అని చెప్పడంతో.. మనస్తాపానికి గురై..

ఆదోని(కర్నూలు): శుభకార్యానికి వెళ్లేందుకు బంగారు చైను ఇవ్వాలని తల్లిని ఓ యువకుడు అడిగాడు.. ఉన్న ఒక్క బంగారు చైను అన్న వేసుకొని వెళ్లాడని వచ్చాక నీవు తీసుకో.. అని తల్లి చెప్పడంతో బాధపడి ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం ఆదోనిలో చోటు చేసుకుంది. వన్‌టౌన్‌ సీఐ చంద్రశేఖర్‌ తెలిపిన సమాచారం మేరకు.. పట్టణంలోని వాల్మీకినగర్‌లో నివాసముంటున్న లక్ష్మి, నర్సయ్య దంపతులకు పెద్దబాబు, చిన్నబాబు ఇద్దరు కుమారులు ఉన్నారు. 15 ఏళ్ల క్రితం తండ్రి నర్సయ్య ఇంటి నుంచి బయటికి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి తల్లి లక్ష్మి ఆ ఇద్దరు కుమారులను కూలీ పనులకు వెళ్లి పెంచి పోషిస్తుంది.   


గురువారం  చిన్నకుమారుడు చిన్నబాబు స్నేహితుడైన కార్తీక్‌ అనే యువకుడి వివాహానికి  వెళ్లేందుకు బంగారు చైను ఇవ్వాలని తల్లిని అడిగాడు. అంతకుముందే  అన్న పెద్దబాబు బంగారు చైను వేసుకొని వెళ్లాడని, వచ్చిన తర్వాత నీవు వేసుకో అంటూ చిన్నబాబుకు నచ్చజెప్పింది. అయితే తాను  అడిగిన వెంటనే బంగారు చైను ఇవ్వలేదన్న క్షణికావేశంతో ఇంట్లో ఎవరు లేని సమయంలో చిన్నబాబు (18) తాను ఉంటున్న గదిలో తాడుతో ఉరేసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు వెంటనే గుర్తించి చికిత్స నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే చిన్నబాబు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. 


Updated Date - 2020-08-07T12:08:46+05:30 IST