కొత్త ఫీచర్లతో అడోబ్‌ ఫొటోషాప్‌

ABN , First Publish Date - 2021-08-21T08:15:12+05:30 IST

అడోబ్‌ ఫోటోషాప్‌ అటు డెస్క్‌టాప్‌, ఇటు యాపిల్‌ ఐపాడ్స్‌ కోసం పెద్ద ఎత్తున

కొత్త ఫీచర్లతో అడోబ్‌ ఫొటోషాప్‌

అడోబ్‌ ఫోటోషాప్‌ అటు డెస్క్‌టాప్‌, ఇటు యాపిల్‌ ఐపాడ్స్‌ కోసం పెద్ద ఎత్తున మార్పులు తీసుకువచ్చింది. డ్రాయింగ్‌ యాప్‌ అడోబ్‌ ఫ్రెస్కోలోనూ సరికొత్త అల్టరేషన్స్‌ చేసింది. డిస్కవర్‌ పేనల్‌లో ట్యుటోరియల్స్‌కు న్యూ సొల్యూషన్స్‌, వన్‌ క్లిక్‌ యాక్షన్స్‌, టైమ్‌ సేవింగ్‌ టూల్స్‌ వంటి మార్పులు చేసింది. ఐపాడ్‌ ఫొటోషాప్‌నకూ ఉద్దేశించి కూడా కొన్ని చేసింది. మొదటిది మేజిక్‌ వాండ్‌ టూల్‌.  ఫ్లాట్‌ బ్యాక్‌గ్రౌండ్‌ కలిగిన ఆబ్జెక్ట్స్‌ సెలెక్షన్‌, టోన్‌, కలర్‌ ఆధారంగా ఏరియాల పట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. కొత్త టూల్స్‌ ఎఐ పవర్‌ ఆధారితం.

''హీలింగ్‌ బ్రష్‌ మరొక టూల్‌. డెస్క్‌టాప్స్‌పై ఫొటోషాప్‌ కోసం స్కై రీప్లేస్‌మెంట్‌ ఎన్‌హాన్స్‌మెంట్స్‌ చేసింది. హై క్వాలిటీ ప్రెసెట్స్‌కు ఉపయోగపడుతుంది. బెజీర్‌ మరొక టూల్‌. టాస్క్‌లను త్వరితగతిన పూర్తి చేసుకోవచ్చు. తద్వారా టైమ్‌ ఆదా అవుతుంది. 


న్యూ ఫోటోషాప్‌ బేటా కూడా ఈ నెలాఖరులోనే అందుబాటులోకి రానుంది. జనంలోకి క్రియేటివ్‌ పీస్‌ వెళ్ళడానికి ముందే టెస్టింగ్‌కు ఉపయోగపడుతుంది.


Updated Date - 2021-08-21T08:15:12+05:30 IST