అడోబ్‌ ‘ఫ్రీమియమ్‌’ వెర్షన్‌

ABN , First Publish Date - 2022-06-18T09:36:52+05:30 IST

అడోబ్‌ ఫొటోషాప్‌ ఫ్రీమియమ్‌ వెర్షన్‌పై పనిచేస్తోంది. ప్రస్తుతం అది కెనడాలో టెస్టింగ్‌లో ఉన్నట్టు సమాచారం.

అడోబ్‌ ‘ఫ్రీమియమ్‌’ వెర్షన్‌

డోబ్‌ ఫొటోషాప్‌ ఫ్రీమియమ్‌ వెర్షన్‌పై పనిచేస్తోంది. ప్రస్తుతం అది కెనడాలో టెస్టింగ్‌లో ఉన్నట్టు సమాచారం. ఈ టూల్‌ త్వరలోనే అందుబాటులోకి రానుందని వినికిడి. ప్రీ అడోబ్‌ అకౌంట్‌కు లాగ్‌ అవుతున్నంత కాలం ‘ఫ్రీమియమ్‌’ వెర్షన్‌ని ఉచితంగా పొందవచ్చు. ప్రస్తుతం ఇది కెనడాలో టెస్టింగ్‌లో ఉన్నట్టు ‘ద వెర్జ్‌’ పేర్కొంది. దీన్ని ఉచితంగా అందించడం ద్వారా ఎక్కువ మందికి చేరేలా చూడాలని కంపెనీ భావిస్తున్నట్టు సమాచారం. అడోబ్‌ గత అక్టోబర్‌లోనే సేవలను విస్తరించింది. దీంతో యాప్‌ ఇన్‌స్టాల్‌  చేసుకోకుండానే నేరుగా తమ వెబ్‌ బ్రౌజర్ల నుంచి ఫొటోషాప్‌ టూల్‌ని యూజర్లు పొందవచ్చు. అలాగే ఫ్రీ వెర్షన్‌ కావడంతో కొత్త ఫొటోషా్‌పను ఫ్రీమియం అంటున్నారు. లాసో, క్విక్‌ సెలెక్షన్‌, మేజిక్‌ వాండ్‌, క్రాపింగ్‌ టూల్స్‌, పెయింట్‌ బ్రెష్‌సను కొత్త సర్వీసులో కలుపుతున్నారు. నేటివ్‌ ఫొటోషాప్‌ లేదంటే ఇలస్ట్రేటర్‌ యాప్‌ తమ మెషీన్‌పై లేకుండానే వాటన్నింటినీ యూజర్లు ఉపయోగించుకోవచ్చు. 

Updated Date - 2022-06-18T09:36:52+05:30 IST