TTD వేద విజ్ఞాన పీఠాల్లో ప్రవేశాలు

ABN , First Publish Date - 2022-05-21T22:09:53+05:30 IST

తిరుపతిలోని తిరుమల తిరుపతి దేవస్థానం(Tirumala Tirupati Temple) (టీటీడీ) - తెలుగు రాష్ట్రాల్లో(Telugu state) నిర్వహిస్తున్న వేద విజ్ఞాన పీఠాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ వెలువడింది. వైదిక సంప్రదాయం ప్రకారం ఉపనయనం పూర్తిచేసుకొన్న బాలురు దరఖాస్తు చేసుకోవచ్చు. వేద సంబంధిత కోర్సులకు నిర్దేశించిన ప్రకారం వయసు, విద్యార్హతలు ఉండాలి. అభ్యర్థులు టీటీడీ

TTD వేద విజ్ఞాన పీఠాల్లో ప్రవేశాలు

తిరుపతిలోని తిరుమల తిరుపతి దేవస్థానం(Tirumala Tirupati Temple) (టీటీడీ) - తెలుగు రాష్ట్రాల్లో(Telugu state)  నిర్వహిస్తున్న వేద విజ్ఞాన పీఠాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ వెలువడింది. వైదిక సంప్రదాయం ప్రకారం ఉపనయనం పూర్తిచేసుకొన్న బాలురు దరఖాస్తు చేసుకోవచ్చు. వేద సంబంధిత కోర్సులకు నిర్దేశించిన ప్రకారం వయసు, విద్యార్హతలు ఉండాలి. అభ్యర్థులు టీటీడీ వెబ్‌సైట్‌(TTD website)లో ఇచ్చిన దరఖాస్తు ఫారాన్ని నింపి తాము చేరదలచుకొన్న వేద విజ్ఞాన పీఠానికి పంపుకోవాలి. 


వేద విజ్ఞాన పీఠాలు

  • ఎస్‌.వి.వేద విజ్ఞాన పీఠం, ధర్మగిరి, తిరుమల
  • ఎస్‌.వి. సంస్కృత వేద పాఠశాల, కీసరగుట్ట, మేడ్చల్‌, మల్కాజిగిరి జిల్లా
  • ఎస్‌.వి. వేద పాఠశాల, ఐ.భీమవరం, ఆకివీడు మండలం, పశ్చిమ గోదావరి జిల్లా
  • ఎస్‌.వి. వేద పాఠశాల, శ్రీమత రామాయణ ప్రాంగణం, రామనారాయణ సారిక దగ్గర, విజయనగరం జిల్లా
  • ఎస్‌.వి. వేద పాఠశాల, ఎ.యం.ఆర్‌.ఎస్.ఎల్‌.బీ.సీ క్యాంపస్‌, పానగల్‌, రామగిరి, నల్గొండ జిల్లా
  • ఎస్‌.వి. వేద పాఠశాల, శ్రీ వేంకటేశ్వర వేద విజ్ఞాన పీఠం, కోటప్పకొండ, గురవాయపాలెం పోస్టు, వయా సాతులూరు, నర్సరావుపేట, గుంటూరు జిల్లా


కోర్సులు - అర్హతలు: రుగ్వేదం(శాకల శాఖ), శుక్ల యజుర్వుదం (కాణ్వ శాఖ), కృష్ణ యజుర్వేదం(తైత్తిరీయ శాఖ), సామవేదం (కౌథుమ శాఖ), సామవేదం(జైమినీయ శాఖ), సామవేదం (రాణాయనీయ శాఖ) కోర్సుల వ్యవధి పన్నెండేళ్లు. కృష్ణ యజుర్వేదం(మైత్రయనీయ శాఖ), అథర్వణ వేదం(శౌనక శాఖ) కోర్సుల వ్యవధి ఏడేళ్లు. వీటికి అయిదోతరగతి ఉత్తీర్ణులైన బాలురు అప్లయ్‌ చేసుకోవచ్చు. వయసు పది నుంచి పన్నెండేళ్ల మధ్య ఉండాలి. దివ్య ప్రబందం, వైఖానసాగమం, పాంచరాత్రాగమం, చాట్టాడ శ్రీ వైష్ణవ ఆగమం, శైవాగమం, తంత్రసార ఆగమం, రుగ్వేద స్మార్తం(అస్వలాయన), శుక్ల యజుర్వేద స్మార్తం (పారస్కర), కృష్ణయజుర్వేద స్మార్తం(ఆపస్తంబ), వైఖానస స్మార్తం, ఆపస్తంబ పౌరోహిత్యం(స్మార్తం), బోదయన పౌరోహిత్యం (స్మార్తం) కోర్సుల వ్యవధి ఎనిమిదేళ్లు. కనీసం ఏడోతరగతి ఉత్తీర్ణులు ఈ కోర్సులకు అప్లయ్‌ చేసుకోవచ్చు. వయసు 12 నుంచి 14 ఏళ్ల మధ్య ఉండాలి. 


ముఖ్య సమాచారం

దరఖాస్తు చేరేందుకు చివరి తేదీ: జూన్‌ 5

వెబ్‌సైట్‌: www.tirumala.org



Updated Date - 2022-05-21T22:09:53+05:30 IST