Abn logo
Sep 25 2021 @ 00:34AM

సర్కారు బడుల్లో ప్రవేశాల జోరు

జగిత్యాలలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల

ఏయేటికి ఆ యేడు పెంపు

అధిక ఫీజులు కట్టలేక సర్కారు బాట

కరోనా నేపథ్యంలో మారిన తీరు

జగిత్యాల, సెప్టెంబరు 24 (ఆన్‌లైన్‌): జిల్లాలోని ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల ప్రవేశాల జోరు పెరుగుతోంది. దీంతో ప్రైవేటు యాజమా న్యాలు బేజారవుతున్నాయి. ఏ యేటికి ఆ యేడు సర్కారు పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాల సంఖ్య పెరుగుతోంది. సుమారు సంవత్సర కాలంగా కరోనా విస్తృతితో సగటు కుటుంబాల ఆదాయం గణనీయంగా తగ్గిపో యింది. ఇదే సమయంలో కుటుంబాల ఖర్చూ పెరిగింది. అసలే ఆదా యం లేక, వ్యయం పెరిగి మద్య, చిన్న తరగతి కుటుంబాలు ఆర్థిక అ వస్థలను ఎదుర్కొంటున్నాయి. ప్రస్తుతం ప్రైవేటు బడుల్లో వసూలు చే స్తున్న ఫీజులను కట్టలేక పలువురు తల్లిదండ్రులు ప్రత్యామ్నాయం వైపు దృష్టి సారిస్తున్నారు. సర్కారు బడుల్లో తమ పిల్లలను చేర్పిస్తున్నారు. దీనికి తోడు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, అధికారులు, ఉపాధ్యా యులు చేస్తున్న కృషి, అవగాహణ కార్యక్రమాలు, పెరిగిన మౌలిక వస తులు, పరీక్ష ఫలితాలు విద్యార్థుల తల్లిదండ్రులను ఆకర్శిస్తున్నాయి. దీం తో సర్కారు పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఆశాజనకంగా పెరుగుతోంది.


జిల్లాలో పరిస్థితి....

జిల్లాలో మొత్తం 853 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో మొత్తం 79,185 మంది విద్యార్థులు ఉండగా, ప్రైవేటు పాఠశాలల్లో 69,494 మంది విద్యార్థులు ఉన్నారు. జిల్లాలోని 2 మినీ గురుకులాల్లో 273 మంది విద్యార్థులు, 5 మైనార్టీ గురుకులాల్లో 1,593 మంది విద్యార్థు లు, 6 బీసీ సంక్షేమ గురుకులాల్లో 2,151 మంది విద్యార్థులు, 7 సాంఘి క సంక్షేమ పాఠశాలల్లో 3,399 మంది విద్యార్థులు, 3 టీడబ్ల్యూ ఆశ్రమ పాఠశాలల్లో 188 మంది విద్యార్థులు, ఒక అర్బన్‌ గురుకులంలో 38 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారు.

నాలుగేళ్లుగా పెరుగుతున్న ప్రవేశాలు....

జిల్లాలోని సర్కారు పాఠశాలల్లో నాలుగేళ్లుగా విద్యార్థుల ప్రవేశాల సంఖ్య పెరుగుతోంది. జిల్లాలో 2018-19లో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాల ల్లో 70,577 మంది విద్యార్థులుండగా 2021-22లో 79,185 మంది విద్యా ర్థులకు చేరింది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో 8,570 మంది విద్యార్థులు సర్కారు పాఠశాలల్లో ప్రవేశాలను అధికంగా పొందారు. 


ప్రభుత్వ పాఠశాలల్లో పెరిగిన వసతులు, నాణ్యమైన విద్య....

జిల్లాలోని పలు ప్రాంతాల్లో మినహా మిగిలిన అన్ని ప్రాంతాల్లో గల ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతోంది. దీనికితోడు పాఠ శాలల్లో మౌలిక వసతులు సైతం గతంతో పోలిస్తే మెరుగుపడ్డాయి. వి ద్యార్థులను చదువుతో పాటు క్రీడా తదితర రంగాల్లోసైతం నిపుణులు గా తీర్చిదిద్దుతున్నారు. ప్రస్తుతం తరగతి గదుల్లో 19 మంది విద్యార్థు లుంటే ఒక ఉపాధ్యాయుడు, 20 నుంచి 40 మంది విద్యార్థులకు ఇద్దరు, 40 నుంచి 60 మంది విద్యార్థులకు ముగ్గురు ఉపాధ్యాయులు ఉండేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు. 

సమష్టి కృషితోనే సత్ఫలితాలు

 తిరుక్కోవెల శ్యాం సుందర్‌, జిల్లా అధ్యక్షుడు టీఎస్‌ యూటీఎఫ్‌, 

సమష్టి కృషితోనే సత్ఫలితాలు అందుతున్నాయి. సర్కారు పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచడానికి ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయు లు, ఎస్‌ఎంసీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థుల తల్లి దండ్రులు ఇలా ప్రతీ ఒక్కరూ ఎవరికి వారు తమదైన పాత్రను పోషిస్తున్నారు. 


విద్యార్థుల సంఖ్యను పెంచుతున్నాం

- జగన్‌ మోహన్‌ రెడ్డి, జిల్లా విద్యాధికారి

సర్కారు పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచుతున్నాము. ఇం దుకు అవసరమైన పలు చర్యలు తీసుకుంటున్నాము. విద్యార్థుల తల్లి దండ్రుల ఆలోచన మేరకు అవసరమైన మౌలిక వసతులు, నాణ్యమైన బోధనను కల్పిస్తున్నాము. ఉపాధ్యాయులు, అధికారులు ఇందుకు అను గుణంగా ప్రతీ నిత్యం కృషి చేస్తున్నారు.