Indo Swiss Training Centerలో ప్రవేశాలు

ABN , First Publish Date - 2022-06-30T21:03:06+05:30 IST

సీఎస్‌ఐఆర్‌ - సీఎస్‌ఐఓ ఆధ్వర్యంలోని ఇండో స్విస్‌ ట్రెయినింగ్‌ సెంటర్‌(ఐఎస్‌టీసీ) పలు డిప్లొమా ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. వీటికి ఏఐసీటీఈ గుర్తింపు ఉంది

Indo Swiss Training Centerలో ప్రవేశాలు

సీఎస్‌ఐఆర్‌ - సీఎస్‌ఐఓ ఆధ్వర్యంలోని ఇండో స్విస్‌ ట్రెయినింగ్‌ సెంటర్‌(ఐఎస్‌టీసీ) పలు డిప్లొమా ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. వీటికి ఏఐసీటీఈ గుర్తింపు ఉంది. ఎంట్రెన్స్‌ టెస్ట్‌, కౌన్సెలింగ్‌ ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. 


ప్రోగ్రామ్‌లు

  • మూడేళ్ల డిప్లొమా ఇన్‌ మెకానికల్‌ ఇంజనీరింగ్‌ (టూల్‌ అండ్‌ డై)
  • మూడేళ్ల డిప్లొమా ఇన్‌ ఎలకా్ట్రనిక్స్‌ ఇంజనీరింగ్‌
  • నాలుగేళ్ల అడ్వాన్స్‌డ్‌ డిప్లొమా ఇన్‌ డై అండ్‌ మౌల్డ్‌ మేకింగ్‌
  • నాలుగేళ్ల అడ్వాన్స్‌డ్‌ డిప్లొమా ఇన్‌ మెకట్రానిక్స్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ ఆటొమేషన్‌

అర్హత: పదోతరగతి/ తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రస్తుతం పరీక్షలు రాసి ఫలితాల కోసం చూస్తున్నవారు కూడా అప్లయ్‌ చేసుకోవచ్చు. అభ్యర్థులు 2003 ఆగస్టు 1న/ ఆ తరవాత జన్మించి ఉండాలి.


ముఖ్య సమాచారం

ఫీజు: జనరల్‌ అభ్యర్థులకు రూ.1200; ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.600

దరఖాస్తుకు చివరి తేదీ: జూలై 22  

అడ్మిట్‌ కార్డ్‌ డౌన్‌లోడింగ్‌: జూలై 31 

పరీక్ష కేంద్రాలు: చండీగఢ్‌, న్యూఢిల్లీ, పట్నా, నాగ్‌పూర్‌, చెన్నై

ఐఎస్‌టీసీ ఎంట్రెన్స్‌ ఎగ్జామ్‌ తేదీ: ఆగస్టు 21

ఫలితాలు విడుదల: ఆగస్టు 29

కౌన్సెలింగ్‌: సెప్టెంబరు 8, 9

ప్రోగ్రామ్‌లు ప్రారంభం: సెwప్టెంబరు 12 నుంచి

వెబ్‌సైట్‌: www.istc.ac.in

Updated Date - 2022-06-30T21:03:06+05:30 IST