IIHTలో డిప్లొమాలు

ABN , First Publish Date - 2022-06-22T22:27:23+05:30 IST

తిరుపతి జిల్లా వెంకటగిరిలోని శ్రీ ప్రగడ కోటయ్య మెమోరియల్‌ ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హ్యాండ్‌లూం టెక్నాలజీ(ఎస్‌పీకేఎం ఐఐహెచ్‌టీ)- డిప్లొమా ఇన్‌ హ్యాండ్‌లూం అండ్‌ టెక్స్‌టైల్‌

IIHTలో డిప్లొమాలు

తిరుపతి జిల్లా వెంకటగిరిలోని శ్రీ ప్రగడ కోటయ్య మెమోరియల్‌ ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హ్యాండ్‌లూం టెక్నాలజీ(ఎస్‌పీకేఎం ఐఐహెచ్‌టీ)- డిప్లొమా ఇన్‌ హ్యాండ్‌లూం అండ్‌ టెక్స్‌టైల్‌ టెక్నాలజీ(డీహెచ్‌టీటీ) ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ప్రోగ్రామ్‌ వ్యవధి మూడేళ్లు. చివరి ఏడాది రెగ్యులర్‌ సబ్జెక్టులతోపాటు అదనంగా  ‘అప్పారెల్‌ అండ్‌ గార్మెంట్‌ మేకింగ్‌ టెక్నాలజీ(ఏజీఎంటీ)’ సబ్జెక్టును బోధిస్తారు. అకడమిక్‌ మెరిట్‌, కౌన్సెలింగ్‌ ద్వారా అడ్మిషన్స్‌ ఇస్తారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు మొదటి ఏడాది రూ.1000; రెండో ఏడాది రూ.1100; మూడో ఏడాది రూ.1200ల స్టయిపెండ్‌ ఇస్తారు. బాలికలకు హాస్టల్‌ సౌకర్యం లేదు. 

సీట్లు: వెంకటగిరి ఎస్‌పీకేఎం ఐఐహెచ్‌టీలో 66 సీట్లు ఉన్నాయి. వీటిలో 53 సీట్లను తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు ప్రత్యేకించారు. అలాగే తమిళనాడులోని సేలం ఐఐహెచ్‌టీలో 11 సీట్లు; కర్ణాటకలోని గడగ్‌ కేహెచ్‌టీఐలో 4 సీట్లు ఉన్నాయి. ఒడిషాలోని బార్గర్‌ ఐఐహెచ్‌టీలో 9 సీట్లను తెలంగాణ అభ్యర్థులకు నిర్దేశించారు. 

అర్హత: పదోతరగతి లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. జూలై 1 నాటికి అభ్యర్థుల వయసు 15 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి. ఇంటర్‌ (ఎంపీసీ)/ ఇంటర్‌ ఒకేషనల్‌(టెక్స్‌టైల్‌ విభాగాలు)/ పదోతరగతితోపాటు రెండేళ్ల ఐటీఐ కోర్సు ఉత్తీర్ణులు లేటరల్‌ ఎంట్రీ కింద రెండో ఏడాది ప్రోగ్రామ్‌లో చేరవచ్చు. ఒకేషనల్‌ అభ్యర్థులు ఐఐహెచ్‌టీ నిర్వహించే బ్రిడ్జ్‌ కోర్సు(మేథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ) పూర్తిచేయాల్సి ఉంటుంది. 


దరఖాస్తు ఫీజు: రూ.100

దరఖాస్తు సబ్మిషన్‌కు చివరి తేదీ: జూలై 15

దరఖాస్తు పంపాల్సిన చిరునామా: ప్రిన్సిపాల్‌, శ్రీ ప్రగడ కోటయ్య మెమోరియల్‌ ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హ్యాండ్‌లూం టెక్నాలజీ (ఎస్‌పీకేఎం ఐఐహెచ్‌టీ), వెంకటగిరి - 524132, తిరుపతి జిల్లా.

వెబ్‌సైట్‌: www.iihtvgr.com

Updated Date - 2022-06-22T22:27:23+05:30 IST