జ్యోతిబాపూలే రెసిడెన్షియల్‌కాలేజీల్లో అడ్మిషన్ల గడువు పొడిగింపు

ABN , First Publish Date - 2020-07-13T23:40:42+05:30 IST

మహాత్మాజ్యోతిబాపూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్త బాల బాలికలకు ఇంగ్లీష్‌ మీడియం జూనియర్‌, డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు గడువు

జ్యోతిబాపూలే రెసిడెన్షియల్‌కాలేజీల్లో అడ్మిషన్ల గడువు పొడిగింపు

హైదరాబాద్‌: మహాత్మాజ్యోతిబాపూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్త బాల బాలికలకు ఇంగ్లీష్‌ మీడియం జూనియర్‌, డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు గడువు పొడిగించినట్టు విద్యాసంస్థల కార్యదర్శి మల్లయ్యభట్టు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జూనియర్‌ కళాశాలలు, మహిళా డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరంలో ప్రవేశాల కొరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 19వ తేదీ వరకూ గడువు పొడిగించినట్టు తెలిపారు. ఆన్‌లైన్‌లోనే దరఖాస్తుచేసుకోవాలని ఆయన వెల్లడించారు. ప్రవేశ పరీక్ష ఎప్పుడు నిర్వహించేది అన్నవిషయం పై విద్యార్ధులకు నేరుగా సమాచారం ఇస్తామన్నారు. అర్హులైన బిసి, ఎస్‌సి, ఎస్‌టి, ఈబీసీ, విద్యార్దినీ, విద్యార్ధులు ఈ అవకాశాన్నిసద్వినియోగం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తిచేశారు. 

Updated Date - 2020-07-13T23:40:42+05:30 IST