గ్రూప్‌లో మెసేజ్‌లపై అడ్మిన్‌కు సర్వాధికారం !

ABN , First Publish Date - 2022-01-28T08:51:19+05:30 IST

మీరు ఏదైనా వాట్సప్‌ గ్రూపునకు అడ్మిన్‌గా ఉన్నారా ? అయితే మీకిది శుభవార్తే. గ్రూపునకు బాధ్యులైన అడ్మిన్లకు మరింత అధికారం అందించేలా వాట్సప్‌లో ఓ సరికొత్త ఫీచర్‌ అందుబాటులోకి రానుంది. దీని సాయంతో గ్రూపు సభ్యుల్లో ఎవరు ..

గ్రూప్‌లో మెసేజ్‌లపై అడ్మిన్‌కు సర్వాధికారం !

మెసేజ్‌ ఎవరు పెట్టినా డిలీట్‌ చేసే అవకాశం


న్యూఢిల్లీ, జనవరి 27: మీరు ఏదైనా వాట్సప్‌ గ్రూపునకు అడ్మిన్‌గా ఉన్నారా ? అయితే మీకిది శుభవార్తే. గ్రూపునకు బాధ్యులైన అడ్మిన్లకు మరింత అధికారం అందించేలా వాట్సప్‌లో ఓ సరికొత్త ఫీచర్‌ అందుబాటులోకి రానుంది. దీని సాయంతో గ్రూపు సభ్యుల్లో ఎవరు పెట్టిన మెసేజ్‌నైనా ఎవ్వరికి కనిపించకుండా తీసేసే (డెలిట్‌ ఫర్‌ ఎవ్రీవన్‌) అధికారం అడ్మిన్‌కు వస్తుంది. గ్రూపు ఉద్దేశానికి వ్యతిరేకంగా ఉన్న ఎలాంటి మెసేజ్‌నైనా సభ్యులంతా చూసే లోపు అడ్మిన్లు పూర్తిగా తొలిగించవచ్చు. ఒక వేళ గ్రూపునకు ఒకరి కంటే ఎక్కువ మంది అడ్మిన్లు ఉంటే వారందరికీ ఈ ఆప్షన్‌ అందుబాటులోకి వస్తుంది. ఈ కొత్త ఫీచర్‌ అతి త్వరలోనే వాట్సప్‌ బీటా యూజర్లకు అందుబాటులోకి రానుందని సమాచారం. కాగా, డెలిట్‌ మెసేజ్‌ ఫర్‌ ఎవ్రీ వన్‌ ఆప్షన్‌ సమయాన్ని పెంచడంపై కూడా వాట్సప్‌ కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం మెసేజ్‌ పెట్టిన దగ్గరి నుంచి ఒక గంటా, ఎనిమిది నిమిషాల 16 సెకన్ల వరకు మాత్రమే డెలిట్‌ మెసేజ్‌ ఫర్‌ ఎవ్రీవన్‌కు అవకాశం ఉంది. ఈ సమయాన్ని ఏడు రోజుల వరకు పొడిగించాలని ఆ సంస్థ భావిస్తుంది.

Updated Date - 2022-01-28T08:51:19+05:30 IST