Adivi Shesh: బాలీవుడ్‌లో రెండు సినిమాలకు సైన్..

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో అడవి శేష్ రెండు బాలీవుడ్ చిత్రాలకు సైన్ చేశారు. శేష్‌కు నటనతో పాటు కథ - స్క్రీన్ ప్లే వంటి విభాగాల్లోనూ మంచి పట్టుంది. మల్టీ టాలెంటెడ్ అయిన ఆయన ప్రస్తుతం 'మేజర్' చిత్రంలో నటిస్తున్నారు. పాన్ ఇండియా సినిమాగా తెలుగుతో పాటు మలయాళ, హిందీ భాషల్లో 2022, ఫిబ్రవరి 11న విడుదల చేబోతున్నారు. 26/11 ముంబై ఉగ్రవాద దాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్‌గా ఈ మూవీ తెరకెక్కుతోంది. 'గూఢచారి' ఫేమ్ శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహిస్తున్న ఇందులో బాలీవుడ్ బ్యూటీ సాయీ మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే.. శోభితా దూళిపాళ్ల, ప్రకాష్ రాజ్, రేవతి, మురళీ శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ సినిమాను సోనీ పిక్చర్స్ - జీఎంబీ ఎంటర్టైన్మెంట్ - A+S మూవీస్ కలిసి నిర్మిస్తున్నాయి. కాగా, ఈ సినిమా రిలీజ్ కాకుండానే అడవి శేష్ తాజాగా రెండు బాలీవుడ్ చిత్రాలలో నటించేందుకు సైన్ చేసినట్టు స్వయంగా వెల్లడించారు. త్వరలో ఈ ప్రాజెక్ట్స్‌కు సంబంధించిన పూర్తి వివరాలను అధికారికంగా మేకర్స్ ప్రకటించబోతున్నారు. 

Advertisement