ఘనంగా ఆదిత్యుని కొట్నం దంపు

ABN , First Publish Date - 2021-04-23T05:27:47+05:30 IST

అసరవల్లి సూర్యనారాయణస్వామి వార్షిక కల్యాణోత్సవాల్లో భాగంగా గురువారం సాయంత్రం సుగంధ ద్రవ్య మర్ధన (కొట్నం దంపు) కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

ఘనంగా ఆదిత్యుని కొట్నం దంపు
కొట్నం దంపు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న దృశ్యం

గుజరాతీపేట: అసరవల్లి సూర్యనారాయణస్వామి వార్షిక కల్యాణోత్సవాల్లో భాగంగా గురువారం సాయంత్రం  సుగంధ ద్రవ్య మర్ధన (కొట్నం దంపు) కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకుడు ఇప్పిలి శంకరశర్మ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో  పాలకమండలి సభ్యులు పైడి భవాని, సూపరింటెండెంట్‌ చక్రవర్తి, సిబ్బంది పాల్గొన్నారు. కొవిడ్‌ కారణంగా భక్తులను  అనుమతించలేదని ఈవో హరిసూర్యప్రకాష్‌ తెలిపారు. 


 


 

Updated Date - 2021-04-23T05:27:47+05:30 IST