Abn logo
Mar 2 2021 @ 23:35PM

నిబంధనల ప్రకారం ఓటింగ్‌ నిర్వహించాలి

ఎన్నికల సిబ్బంది సమావేశంలో అదనపు కలెక్టర్‌

వరంగల్‌ రూరల్‌ కల్చరల్‌, మార్చి 2: ఎన్నికల నిబంధనల ప్రకారం ఎమ్మెల్సీ ఓటింగ్‌ను నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్‌ ఆర్‌. మహేందర్‌రెడ్డి సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రిసైడింగ్‌, అసిస్టెంట్‌ ప్రిసైడింగ్‌ అధికారులకు తొలివిడత శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎన్నికల అధికారులుగా నియమించబడ్డ అందరికీ మాస్టర్‌ ట్రైన్‌లతో ఎన్నికల ఓటింగ్‌ పద్ధతిపై శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ శిక్షణ ద్వారా పోలింగ్‌పై పూర్తి అవగాహన తెచ్చుకొని ఎన్నికలను విజయవంతంగా నిర్వహించాలని సూచించారు. తొలివిడతగా 46 పోలింగ్‌ కేంద్రాలకు గానూ 55మంది ప్రిసైడింగ్‌ అధికారులు, 55మంది అదనపు ప్రిసైడింగ్‌ అధికారులకు శిక్షణ ఇవ్వడం జరుగుతోందన్నారు. సమావేశంలో అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారి బి. హరిసింగ్‌, ఎలక్షన్‌ నోడల్‌ అధికారి శ్రీనివాసరావు, ఎం.మల్లేషం, ఎం. వెంకటేశ్వర్‌రావు, నాగరాజు, పవన్‌కుమార్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement