Abn logo
Apr 10 2020 @ 12:36PM

విలన్ పాత్రలో అదితి?

నటనకు ప్రాధాన్యం ఉండే, విభిన్న తరహా పాత్రలను పోషించడానికి అదితీ రావు హైదరీ ఎప్పుడూ ముందుకొస్తుంది. డైరెక్టర్ ఇంద్రగంటి మోహన్‌కృష్ణ రూపొందించిన `సమ్మోహనం` సినిమాతో తెలుగు ప్రజలకు చేరువైన అదితి.. ప్రస్తుతం ఆయనే రూపొందిస్తున్న `వి` సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో నాని, సుధీర్ బాబు కథానాయకులు. నివేదా థామస్ మరో హీరోయిన్. 


ఈ సినిమాలో అదితి పాత్ర గురించి ఓ ఆసక్తికర అప్‌డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమాలో అదితి విలన్ పాత్రలో కనిపించనుందట. నాని కూడా ఈ సినిమాలో ప్రతినాయక ఛాయలున్న పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. నానికి జోడీగా ఈమె కూడా అదే తరహా పాత్రలో కనిపించనుందట. గత నెల 25న విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడింది. కొత్త విడుదల తేదీని త్వరలోనే చిత్రబృందం ప్రకటించనుంది. 

Advertisement
Advertisement
Advertisement