'ఆదిపురుష్': సీత పాత్ర షూటింగ్ పూర్తి

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న బాలీవుడ్ స్ట్రైట్ మూవీ 'ఆదిపురుష్'. ఇందులో ప్రభాస్ రాముడి పాత్రలో నటిస్తుండగా, ఆయన సరసన సీతగా బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ కృతి సనన్ కనిపించబోతుంది. తాజాగా ఈ మూవీలో ఆమె పార్ట్ చిత్రీకరణ పూర్తైంది. హిందీ - తెలుగు భాషలలో ఒకేసారి తెరకెక్కిస్తున్న ఈ మూవీలో కీలక పాత్రలు పోషిస్తున్న ఒక్కొక్కరూ, తమ షూటింగ్‌ను కంప్లీట్ చేస్తున్నారు. గత వారమే 'ఆదిపురుష్' మూవీలో రావణాసురుని పాత్రలో కనిపించబోతున్న బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ తన పాత్ర షూటింగ్ కంప్లీట్ చేయగా, తాజాగా హీరోయిన్ కృతి సనన్ కూడా తన పాత్ర షూటింగ్‌ను పూర్తి చేసినట్టు దర్శకుడు తెలిపారు. ఈ మేరకు హీరోయిన్ కృతితో కలిసి ఉన్న ఓ పిక్‌ను సోషల్ మీడియాలో పంచుకున్నారు. కాగా 3డిలో అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్న 'ఆదిపురుష్' 2022, ఆగష్టు 11న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. 

Advertisement