Chitrajyothy Logo
Advertisement
Published: Tue, 28 Jun 2022 11:29:40 IST

Adipurush: ఆ తర్వాతే ఫస్ట్ లుక్..?

twitter-iconwatsapp-iconfb-icon

ఓమ్ రౌత్ (Om Routh) దర్శకత్వంలో గ్లోబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) నటిస్తున్న పౌరాణిక చిత్రం 'ఆదిపురుష్' (Adipurush). తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ న్యూస్ ఇప్పుడు సోషల్ చక్కర్లు కొడుతోంది. ప్రభాస్ గత చిత్రం 'రాధే శ్యామ్' అభిమానులను తీవ్రంగా నిరాశ పరిచింది. ప్రభాస్‌కు బ్యాక్ టు బ్యాక్ రెండు భారీ ఫ్లాప్స్ పడ్డాయి. దాంతో రానున్న సినిమాలపై ప్రత్యేక దృష్ఠి పెట్టారు. 'సలార్' (Salaar), 'ఆదిపురుష్', 'ప్రాజెక్ట్ K' (Project K) చిత్రాలను పూర్తి చేసే పనిలో ఉన్నారు డార్లింగ్. రామాయణ కథ ఆధారంగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపించబోతున్న విషయం తెలిసిందే. 

ఇక ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఎప్పుడో పూర్తి చేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా కొనసాగుతున్నాయి. ఇటీవల గ్రాఫిక్స్ పనులు కూడా దాదాపు తుది దశకు చేరుకున్నట్లుగా మేకర్స్ తెలియజేశారు. అయితే, ప్రస్తుతం ఫైనల్ వర్క్ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. డబ్బింగ్ పనులు పూర్తయితే సినిమాకు సంబంధించిన అన్నీ పనులు పూర్తైనట్టే అని సమాచారం. ఇక నటీనటులు కూడా ఇప్పటికే వారికి సంబంధించిన డబ్బింగ్ పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రధాన తారాగణం డబ్బింగ్ వర్క్ ను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారట. 'ఆదిపురుష్' సినిమాను మిగతా భాషల్లో కూడా భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు.

అందుకే, వీఎఫెక్స్..డబ్బింగ్ సహా ఇతర విభాగాలలోనూ అన్నీ పనులు పక్కాగా కుదిరేలా దర్శకుడు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నటీనటులందరికీ సంబంధించిన డబ్బింగ్ పనులు కంప్లీట్ అయ్యాకే ఆదిపురుష్ సినిమా నుంచి ఫస్ట్ లుక్ టీజర్ వదలాలని టీమ్ భావిస్తుందట. దీనిపై త్వరలో స్పష్ఠత రానుంది. కాగా, ఈ చిత్రాన్ని 2023, సంక్రాంతికి ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ఇదివరకే మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. ఈ మూవీలో సీతగా కృతి సనన్, లంకేష్ పాత్రలో సైఫ్ అలీఖాన్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్ కనిపించబోతున్నారు. 

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement