న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ దంపతులపై దాఖలైన ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సుప్రీంకోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పును రిజర్వ్ చేసింది. సీబీఐ తరఫు న్యాయవాది వాదనలు....120 మందికి పైగా సాక్షులను విచారణ చేశామని, 5 వందలకు పైగా దస్తవేజులను పరిశీలించామని తెలిపారు. దర్యాప్తు చివరి దశకు వచ్చిందని, 3 నెలల్లో దర్యాప్తు పూర్తి అవుతుందని చెప్పారు. ఈ సమయంలో ప్రాథమిక విచారణ జరపమని చెప్పవద్దని విజ్ఞప్తి చేశారు. విచారణ పూర్తి చేసిన తర్వాత ఛార్జ్ షీట్ నివేదిక అందజేస్తామన్నారు. నివేదికను పరిశీలించి న్యాయస్థానం నిర్ణయం తీసుకోవచ్చునని సీబీఐ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు.