ఆదిలాబాద్‌ జిల్లాలో ఉత్కంఠ

ABN , First Publish Date - 2020-04-04T10:59:38+05:30 IST

జిల్లాలో ఉత్కంఠ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇప్పటికే ఢిల్లీలో మతపరమైన ప్రార్థనలకు వెళ్లివచ్చిన 67 మందిని గుర్తించిన అధికారులు వారిని హుటాహుటిన

ఆదిలాబాద్‌ జిల్లాలో ఉత్కంఠ

67 మంది రక్త నమూనాలనుపరీక్షలకు పంపిన అధికారులు

ఆందోళనలో జిల్లా ప్రజలు 


ఆదిలాబాద్‌, ఏప్రిల్‌3 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఉత్కంఠ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇప్పటికే ఢిల్లీలో మతపరమైన ప్రార్థనలకు వెళ్లివచ్చిన 67 మందిని గుర్తించిన అధికారులు వారిని హుటాహుటిన క్వారంటైన్‌కు తరలించారు. వీరందరి రక్తనమునాలను పరీక్షల నిమిత్తం హైదరాబాద్‌కు పంపారు.


దీంతో రక్త పరీక్షల రిపోర్టు ఏవిధంగా వస్తాయోననే ఆందోళన వ్యక్తమవుతోంది. అధికారులు మాత్రం ఎప్పుడు వచ్చే ది స్పష్టంగా చెప్పలేమంటున్నారు. ఇప్పటివరకు జిల్లా లో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాలేదు. అలాగే లాక్‌డౌన్‌ను పకడ్బందీగా అమలు చేస్తున్నారు. ఉచిత బియ్యాన్ని టోకెన్ల ద్వారా సరఫరా చేస్తున్నారు. ముఖ్య ంగా సామాజిక దూరాన్ని పాటించాలని ప్రజలకు అవ గాహన కల్పిస్తున్నారు. 

Updated Date - 2020-04-04T10:59:38+05:30 IST