TS News: కన్న కూతురి కల నెరవేరింది.. నిరుపేదలకు విమాన ప్రయాణం..

ABN , First Publish Date - 2022-10-04T19:26:56+05:30 IST

కన్న కూతురి కల నెరవేరింది.. త్వరలోనే పైలట్‌గా విధుల్లో చేరనుంది.

TS News: కన్న కూతురి కల నెరవేరింది.. నిరుపేదలకు విమాన ప్రయాణం..

ఆదిలాబాద్ (Adilabad): కన్న కూతురి కల నెరవేరింది.. త్వరలోనే పైలట్‌గా విధుల్లో చేరనుంది. ఈ సంతోషాన్ని ఓ యజమాని తనతోపాటు పనిచేస్తున్న సిబ్బందితో పంచుకున్నారు. ఆ నిరుపేదలను విమానం ఎక్కించి తిరుమల శ్రీవారి దర్శనం చేయించారు. ఆదిలాబాద్ జిల్లాలో ఓ దుకాణందారు ఔదార్యంపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం...


వారంతా నిరుపేదలు షాపులో పనిచేస్తూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. అలాంటి వారికి ఒక్కసారిగా విమానం ఎక్కే అవకాశం దక్కింది. తిరుమల శ్రీవారి దర్శనం చేసుకునే అదృష్టం కలిగింది. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లికి చెందిన కిరాణా దుకాణం యజమాని అజీజ్ హిరాణీ తన వద్ద పనిచేసే సిబ్బందికి ఈ అవకాశం కల్పించారు. నిరుపేదలైన 15 మంది సిబ్బందిని విమానంలో తీసుకువెళ్లి తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి దర్శన భాగ్యం కలిగించారు. నిరుపేద, దళిత, ఆదివాసి వర్గాలకు చెందిన వారిని విమానంలో తిరుపతి యాత్రకు తీసుకువెళ్లడంపై ప్రశంసలు వెళ్లువెత్తుతున్నాయి.


అజీజ్ హిరాణీ కుమార్తె అప్రాణి ఆస్ట్రేలియాలో పైలెట్‌గా ట్రైనింగ్ పూర్తి చేసుకున్నారు. త్వరలో పైలెట్‌గా విధుల్లో చేరనున్నారు. కన్న కూతురి కల నెరవేరిన ఆనందంలో హిరాణీ తన సంతోషాన్ని తనవద్ద పనిచేసే సిబ్బందితో పంచుకున్నారు. శాశ్వతంగా గుర్తుండేలా వారిని ఆనందపరిచేందుకు విమాన ప్రయాణం చేయించాలని నిర్ణయించారు. ఇంద్రవెళ్లి నుంచి హైదరాబాద్‌కు, అక్కడి నుంచి విమానంలో తిరుపతికి తీసుకువెళ్లారు. దీంతో సిబ్బంది సంతోషం వ్యక్తం చేస్తూ.. తమ యజమాని మంచి మనసుకు ధన్యవాదాలు తెలిపారు.

Updated Date - 2022-10-04T19:26:56+05:30 IST