పిల్ల పార్టీనా తల్లిని వెక్కిరించేది?: అధీర్ రంజన్

ABN , First Publish Date - 2021-11-02T00:20:23+05:30 IST

మోదీ బలపడటానికి కాంగ్రెస్సే కారణమని, రాజకీయాలపై కాంగ్రెస్‌కు శ్రద్ధ లేదని తృణమూల్ కాంగ్రెస్..

పిల్ల పార్టీనా తల్లిని వెక్కిరించేది?: అధీర్ రంజన్

న్యూఢిల్లీ: మోదీ బలపడటానికి కాంగ్రెస్సే కారణమని, రాజకీయాలపై కాంగ్రెస్‌కు శ్రద్ధ లేదని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) చేసిన విమర్శలను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అధీర్ రంజన్ చౌదరి తిప్పికొట్టారు. కాంగ్రెస్ నుంచే  తృణమూల్ కాంగ్రెస్ పుట్టిందనే విషయం ఆ పార్టీ ముందు గుర్తుంచుకోవాలని అన్నారు. నీ పని అయిపోయిందని తల్లినే పిల్ల అంటుంటే, ఆ పిల్ల పని కూడా అయిపోయినట్టేనని గ్రహించడం మంచిదని అన్నారు. రాజకీయాలు చేయవచ్చు కానీ మర్యాదగా మాట్లాడటం మరిచిపోకూడదని, మీకున్న స్థాయి ఏంటో మరచిపోవద్దని టీఎంసీకి చురకలు అంటించారు. ఏ పార్టీ నుంచి టీఎంసీ పుట్టిందో ముందు చూసుకోవాలని హితవు చెప్పారు.


కాంగ్రెస్‌కు రాజకీయాల మీద శ్రద్ధ లేకపోవడం వల్ల మాత్రమే నరేంద్ర మోదీ మరింత బలపడుతున్నారని, ఆ పార్టీ నిర్ణయాలు తీసుకోలేకపోతోందని, ఫలితంగా దేశం ఇబ్బందులు పడుతోందని టీఎంసీ నేత, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇటీవల గోవాలో మాట్లాడుతూ కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు.

Updated Date - 2021-11-02T00:20:23+05:30 IST