కార్మికుల కష్టానికి తగిన కూలి

ABN , First Publish Date - 2021-07-31T06:13:56+05:30 IST

నేత కార్మికులు నైపుణ్యంతో పనిచేస్తున్నారని, వారి కష్టానికి తగిన కూలి వచ్చేలా కృషి చేస్తామని రాష్ట్ర పుర పాలక, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు.

కార్మికుల కష్టానికి తగిన కూలి
చెక్కు అందజేస్తున్న మంత్రి కేటీఆర్‌

- పురపాలక, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు 

- సిరిసిల్ల వస్త్ర పరిశ్రమపై సమీక్ష 


(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

నేత కార్మికులు నైపుణ్యంతో పనిచేస్తున్నారని, వారి కష్టానికి తగిన కూలి వచ్చేలా కృషి చేస్తామని రాష్ట్ర పుర పాలక, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. శుక్రవారం సమీకృత కలెక్టరేట్‌లో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ అభివృద్ధిపై సమీక్షించారు. చేనేత జౌళిశాఖ కమిషనర్‌, శైలజరామయ్యార్‌, నాఫ్స్‌కాబ్‌ చైర్మన్‌ కొండూరు రవీందర్‌ రావు, జడ్పీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ,  కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌, టెక్స్‌టైల్‌ అధికారులు, సిరిసిల్ల మ్యాక్స్‌ సోసైటీలు,  ఎస్‌ఎస్‌ఐ యూనిట్ల యజమానులతో సమ స్యలపై చర్చించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ  నేత కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. నేతన్నలు నైపుణ్యంతో పనిచేస్తున్న నేపఽథ్యంలో బతుకమ్మ చీరలు నాణ్యతతో సకాలంలో పూర్తవుతున్నాయన్నారు.  సిరిసిల్ల నేత కార్మికులు ఇప్పటి వరకు రూ.2వేల కోట్లకు పైగా ప్రభుత్వ ఆర్డర్లను పూర్తి చేశారన్నారు.  ఈ ఏడాది 3.50 కోట్ల బతుకమ్మ చీర వస్త్రోత్పత్తి జరిగిందన్నారు. ఇక్కడ ఉత్పత్తి అయిన వస్త్ర నాణ్యతను చెక్‌ చేయడంలో ఆలస్యం చేయకుండా కంపె నీలకు బట్టను పంపించాలని టెస్కో జనరల్‌ మేనేజర్‌ యాదగిరికి సూచించారు.  గతంలో ఉత్పత్తి చేసిన వస్త్రా నికి జరిమానా వేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో చర్చించి యజమానులకు తెలపాలని, పునరావృతం కాకు ండా చూడాలని అన్నారు. కాటన్‌ వస్త్ర పరిశ్రమకు సంబ ంధించి ిస్పిన్నింగ్‌ మిల్లుల వారితో చర్చలు జరపాలని,  సిరిసిల్లలో తయారయ్యే వస్త్రానికి అవసరమయ్యే  యారన్‌ డిపోను ఏర్పాటు చేసేలా చూస్తామని అన్నారు. దాని ద్వారా శాశ్వత పరిష్కారం దొరకుతుందన్నారు.  బెంగళూరుకు చెందిన ప్రముఖ కంపెనీ ఆధునికంగా తయారు చేసిన మరమగ్గాలను సిరిసిల్లకు పరిచయం చేసే విధంగా కాటన్‌ వస్త్ర పరిశ్రమ శ్రద్ధ చూపాలని కోరారు.  మరమగ్గాల పనీతీరును మంత్రికి ల్యాప్‌టాప్‌ల ద్వారా కంపెనీ ప్రతినిధులు వివరించారు. మరమగ్గాలపై తయారు చేసిన బట్టను మంత్రికి అందజేశారు. టెక్స్‌టైల్‌ పార్కులో మరమగ్గాలకు సంబంధించి సమస్యలు ఉంటే త్వరగా పరిష్కరించుకోవాలని మంత్రి అన్నారు.  క్యాంటీ న్‌ను వినియోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు.  

అంతకుముందు వస్త్రోత్పత్తి దారులు పలు అంశా లను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. బతుకమ్మ చీరల డిజైన్లు ఎక్కువగా ఉన్నందున ఎక్కువ మరమగ్గాలు నడపడానికి కార్మికులకు కష్టంగా ఉందని వేతనం తగ్గుతుందని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. గతంలో ఉత్పత్తి చేసిన వస్త్రానికి సంబంధించి జౌళి శాఖ అధి కారులు జరిమానా వేశారని, వాటిని రద్దు చేయాలని విన్నవించారు. డాబీ, జాకార్ట్‌ డిజైన్లతో కార్మికులు ఎక్కువ మరమగ్గాలు నడపడానికి సుముఖత చూపడం లేదని, అన్నారు. వారికి మీటరుకు రూ 1.50 పైసలు పెంచాలని సూచించారు. యారన్‌ సబ్సిడీ పెంచితే ఈ విషయంలో కాస్తా ఇబ్బంది తగ్గుతుందని తెలిపారు. అదనపు కలెక్టర్‌ సత్యప్రసాద్‌, చేనేత జౌళి  శాఖ ఏడీ తస్నీమా, డీడీ అశోక్‌రావు, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జిందం కళ, వస్త్రోత్పత్తి దారుల ప్రతినిధులు జిందం చక్రపాణి, గూడూరి ప్రవీణ్‌, మంచె శ్రీనివాస్‌, అన్నల్‌దాస్‌ అనిల్‌, గోవిందు రవి, దూడం శంకర్‌, భాస్కర్‌, వేముల శ్రీనివాస్‌, సత్యం దుబాల వెంకటేశం, అశోక్‌, గౌడ సురేష్‌ తదితరులు పాల్గొన్నారు. 

కుట్టు మిషన్ల పంపిణీ 

నేషనల్‌ అకాడమీ ఆఫ్‌  కన్‌స్ట్రక్షన్‌ ద్వారా మూడు నెలలు ఉచితంగా కుట్టు శిక్షణ పొందిన 27 మందికి  మంత్రి మిషన్లను అందజేశారు. సమీకృత కలెక్టరేట్‌లో నిరుపేద వ్యవసాయ ఆధారిత దళిత మహిళలకు మూడెకరాల భూ పంపిణీ పథకం ద్వారా లబ్ధి పొందిన ముస్తాబాద్‌, ఎల్లారెడ్డిపేట మండలాలకు చెందిన 30 మందికి  పంట సాయం కింద రూ.11.70 లక్షల విలువ చేసే చెక్కు అందజేశారు. 

మైనార్టీ సమస్యలపై సమీక్ష 

జిల్లా సమీకృత కలెక్టరేట్‌ కార్యాలయంలో సిరిసిల్లకు చెందిన ముస్లిం మైనార్టీలకు సంబంధించిన సమస్యలపై మైనార్టీ ప్రతినిధులతో మంత్రి సమీక్షించారు. అభివృద్ధి పనులకు నిధులను అందిస్తామని హామీ ఇచ్చారు. 

సీసీ కెమెరాల ప్రారంభం 

సిరిసిల్ల మున్సిపల్‌ పరిధిలోని 19వ వార్డులో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను  మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంపై కౌన్సిలర్‌ అన్నారం శ్రీనివాస్‌ను అభినందించారు. చైర్‌పర్సన్‌ జిందం కళ, టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు చక్రపాణి పాల్గొన్నారు. 

Updated Date - 2021-07-31T06:13:56+05:30 IST