పవన్ జనవాణి కార్యక్రమానికి తగిన భద్రత కల్పించాలి

ABN , First Publish Date - 2022-06-30T23:27:10+05:30 IST

విజయవాడ: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ విజయవాడలో నిర్వహించే జనవాణి కార్యక్రమానికి తగిన భద్రత కల్పించాలని జనసేన నేత పోతిన వెంకట

పవన్ జనవాణి కార్యక్రమానికి తగిన భద్రత కల్పించాలి

విజయవాడ: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ విజయవాడలో జులై 3న నిర్వహించే  జనవాణి కార్యక్రమానికి భద్రత కల్పించాలని జనసేన నేత పోతిన వెంకట మహేష్ కోరారు. ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు మాకినేని బసవ పున్యయ్య ఆడిటోరియంలో నిర్వహించే ఈ కార్యక్రమంలో పవన్ పాల్గొని, స్వయంగా ప్రజల నుంచి సమస్యలకు సంబంధించిన అర్జీలు స్వీకరిస్తారు. పవన్ కళ్యాణ్‌ను కలిసేందుకు జనం భారీగా తరలి వచ్చే అవకాశం ఉండడంతో తగిన భద్రత కల్పించాలని పోలీసు కమిషనర్‌ను  కోరారు.  

Updated Date - 2022-06-30T23:27:10+05:30 IST