చిన్నారుల డ్రస్సులకు చిరునామా స్లిప్‌లు

ABN , First Publish Date - 2022-05-17T06:28:45+05:30 IST

మోదకొండమ్మ ఉత్సవాలకు వచ్చే భక్తుల పిల్లల రక్షణ కోసం ఎస్పీ సతీష్‌కుమార్‌ ఆదేశాల మేరకు ఏఎస్పీ జగదీశ్‌ పర్యవేక్షణలో పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.

చిన్నారుల డ్రస్సులకు చిరునామా స్లిప్‌లు
చిన్నారుల డ్రస్సులకు చిరునామా స్లిప్‌లు అతికిస్తున్న పోలీసులు


  ఉత్సవాల్లో పోలీసుల వినూత్న కార్యక్రమం

పాడేరురూరల్‌, మే 16: మోదకొండమ్మ ఉత్సవాలకు వచ్చే భక్తుల పిల్లల రక్షణ కోసం ఎస్పీ సతీష్‌కుమార్‌ ఆదేశాల మేరకు ఏఎస్పీ జగదీశ్‌ పర్యవేక్షణలో పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఉత్సవాల్లో చిన్నారులు తప్పిపోయే అవకాశాలు ఉన్నట్టు గుర్తించిన పోలీస్‌ అధికారులు చిన్నారుల డ్రస్సులకు చిరునామాలతో కూడిన స్లిప్‌లను ఏర్పాటు చేస్తున్నారు. ఆ స్లిప్‌ల్లో చిన్నారుల పూర్తి చిరునామాతోపాటు పోలీస్‌ కంట్రోల్‌రూంల నంబర్లు ఉంటున్నాయి. పోలీసులు చేస్తున్న ఈ పద్ధతిపై తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సీఐ బి.సుధాకర్‌, ఎస్‌ఐలు జి.లక్ష్మణరావు, జి.రంజిత్‌కుమార్‌ పాల్గొన్నారు.


Updated Date - 2022-05-17T06:28:45+05:30 IST