Work Permits రెన్యువల్.. కువైత్‌లోని ఆ కేటగిరీ ప్రవాసులకు ఊహించని షాక్.. అదనపు భారంతో లబోదిబో!

ABN , First Publish Date - 2022-02-13T14:31:53+05:30 IST

గల్ఫ్ దేశం కువైత్ 60 ఏళ్లు పైబడి, యూనివర్శిటీ డిగ్రీలేని ప్రవాసుల వర్క్ పర్మిట్ల రెన్యువల్‌ను ఆదివారం(ఫిబ్రవరి 6) నుంచి ప్రారంభించింది.

Work Permits రెన్యువల్.. కువైత్‌లోని ఆ కేటగిరీ ప్రవాసులకు ఊహించని షాక్.. అదనపు భారంతో లబోదిబో!

కువైత్ సిటీ: గల్ఫ్ దేశం కువైత్ 60 ఏళ్లు పైబడి, యూనివర్శిటీ డిగ్రీలేని ప్రవాసుల వర్క్ పర్మిట్ల రెన్యువల్‌ను ఆదివారం(ఫిబ్రవరి 6) నుంచి ప్రారంభించింది. వర్క్ పర్మిట్ల రెన్యువల్‌ చేసుకోవడంతో పాటు ఆరోగ్య బీమాకు కూడా వీలు కల్పించిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్‌పవర్(పీఏఎం) వర్క్ పర్మిట్ రెన్యువల్ ఫీజును 250 కువైటీ దినార్లుగా(రూ.61వేలు) నిర్ణయించింది. అలాగే బీమా రుసుమును ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ యూనిట్ 500 కువైటీ దినార్లుగా(రూ.1.23లక్షలు)గా పేర్కొంది. ఇంతవరకు బాగానే ఉన్నా.. వర్క్ పర్మిట్ రెన్యువల్ కోసం వెళ్తున్న వలసదారులకు 750 కువైటీ దినార్లలకు అదనంగా మరో 60 కేడీలు(రూ.14,904) అడుతున్నారట. 


దీనిలో 10కేడీలు (పాత రెసిడెన్సీ ఫీజు), మరో 50కేడీలు(సాధారణంగా తీసుకునే ఇన్సూరెన్స్ చార్జీలు) ఇలా మొత్తం 60కువైటీ దినార్లు అదనంగా చార్జ్ చేస్తున్నట్లు వర్క్ పర్మిట్ రెన్యువల్ కోసం వెళ్తున్న ప్రవాసులు చెబుతున్నారు. ఇప్పటికే 750కేడీలు చెల్లించేందుకు అష్టకష్టాలు పడుతున్న తమకు అదనంగా మరో 60కేడీలు కట్టమనడం తలకుమించిన భారంగా మారుతుందని ప్రవాసులు వాపోతున్నారు. ఇదిలాఉంటే.. ఇలా వర్క్ పర్మిట్ రెన్యువల్ ఫీజు, బీమా పాలసీ రుసుముతో కువైత్‌కు ఈ ఏడాది ఏకంగా 42.2 మిలియన్ కువైటీ దినార్ల(రూ.1,041కోట్లు) ఆదాయం సమకూరనుంది. ప్రస్తుతం ఆ దేశంలో ఈ కేటగిరీకి చెందిన వలసదారులు సుమారు 56వేలకు పైనే ఉండడం దీనికి కారణం. ఇక పీఏఎం అధికారిక వెబ్‌సైట్ www.manpower.gov.kw ద్వారా ఆన్‌లైన్‌లో ప్రవాసులకు వర్క్ పర్మిట్లను రెన్యువల్ చేసే వీలు ఉంది. కంపెనీలు అన్ని సంబంధిత పత్రాలను అప్‌లోడ్ చేసిన తర్వాత ఈ వెబ్‌సైట్‌లోకి లాగిన్ అవ్వడం ద్వారా వర్క్ పర్మిట్‌లను పునరుద్ధరించవచ్చు.      

Updated Date - 2022-02-13T14:31:53+05:30 IST