ఉద్యోగులకు అదనపు పరిహారం

ABN , First Publish Date - 2022-08-06T05:19:50+05:30 IST

వంశధార రిజర్వాయర్‌ కారణంగా నిర్వాసితులైన ఉద్యోగులకు అదనపు పరిహారం అందజేస్తామని జేసీ విజయసునీత స్పష్టం చేశారు. శుక్రవారం స్థానిక మండలపరిషత్‌ కార్యాలయంలో వంశధార నిర్వాసితులకు ప్రభుత్వం మంజూరు చేసిన అదనపు పరిహారంపై సమీక్ష నిర్వహించారు.

ఉద్యోగులకు అదనపు పరిహారం
జేసీ విజయసునీతకు సమస్యలు తెలియజేస్తున్న నిర్వాసితులు

వంశధార నిర్వాసితులందరికీ న్యాయం చేస్తాం
జేసీ విజయసునీత
హిరమండలం, ఆగస్టు 5:
వంశధార రిజర్వాయర్‌ కారణంగా నిర్వాసితులైన ఉద్యోగులకు అదనపు పరిహారం అందజేస్తామని జేసీ విజయసునీత స్పష్టం చేశారు. శుక్రవారం స్థానిక మండలపరిషత్‌ కార్యాలయంలో వంశధార నిర్వాసితులకు ప్రభుత్వం మంజూరు చేసిన అదనపు పరిహారంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కొంతమంది ఉద్యోగులు మాట్లాడుతూ అప్పట్లో రూ.5వేలు పరిహారం ఇచ్చిన ఉద్యోగుల్లో ఇప్పటివరకు సుమారు 90 శాతం మందికి  అదనపు పరిహారం చెల్లించారని, మిగతావారికి చెల్లించలేదని అన్నారు. దరఖాస్తు ఇస్తే.. ఉద్యోగులకు అదనపు పరిహారం ఇవ్వడం లేదని తిరస్కరిస్తున్నారన్నారు. దీనిపై జేసీ స్పందిస్తూ.. సిబ్బంది చెప్పిన మాటలు అపోహ అని, ఉద్యోగులకు కూడా అదనపు పరిహారం చెల్లిస్తామని అన్నారు. పరిహారం అందని నిర్వాసితుల జాబితాను తహసీల్దార్‌ కార్యాలయంలో అందుబాటులో ఉంచుతామన్నారు. పాలకొండ నుంచి టెక్కలికి ఆర్డీవో కార్యాలయం మారడంతో కొన్ని రికార్డులు పూర్తిస్థాయిలో రాలేదని, వాటిని కూడా తెప్పించి.. అర్హులైన వారికి అదనపు పరిహారం చెల్లిస్తామని జేసీ తెలిపారు. కార్యక్రమంలో పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డిశాంతి, టెక్కలి ఆర్డీవో జయరాం, తహసీల్దార్‌ బి.మురళీమోహన్‌ పాల్గొన్నారు.  

 

Updated Date - 2022-08-06T05:19:50+05:30 IST