వంశధార నిర్వాసితులకు అదనపు పరిహారం

ABN , First Publish Date - 2022-06-25T05:37:07+05:30 IST

వంశధార నిర్వాసితులకు అదనపు పరిహారం

వంశధార నిర్వాసితులకు అదనపు పరిహారం
ఎమ్మెల్యే రెడ్డి శాంతిని చుట్టుముట్టిన నిర్వాసితులు

హిరమండలం: వంశధార రిజర్వాయర్‌ నిర్మాణనానికి భూములు ఇచ్చిన ప్రజలు నిర్వాసితులు కాదని జిల్లా ప్రజలకు ప్రాణదాతలని రాష్ట్ర రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు, మంత్రి సీదిరి అప్పలరాజు, స్పీకర్‌ తమ్మినేని సీతారాం కొనియాడారు. శుక్రవారం స్థానిక ఓ ప్రైవేట్‌ కల్యాణ మండపంలో వంశధార నిర్వాసితులకు ప్రభుత్వం మంజూరు చేసిన అదనపు పరిహారం చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... అన్ని విధాలుగా నష్టపోయి స్వచ్ఛందంగా భూములు ఇవ్వడం గొప్పవిషయమన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పాదయాత్ర సమయంలో నిర్వాససితులను ఆదుకుంటానని ఇచ్చిన హామీ మేరకు పరిహారం అందించారన్నారు. కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌ మాట్లాడుతూ.. మొత్తం 25వేల మంది నిర్వాసితులకు అదనపు పరిహారం అందించేందుకు రూ.216.17 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. గతంలో పరిహారం అందుకున్న ప్రతి ఒక్కరికీ అదనపు పరిహారం అందిస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌, ఎమ్మెల్యే రెడ్డి శాంతి, వంశధార ఎస్‌ఈ డోల తిరుమలరావు, తహసీల్దార్‌ సత్యనారాయణ, ఎంపీడీవో కాశీవిశ్వనాథరావు, పీఏసీఎస్‌ అధ్యక్షుడు ఏవీ సురేష్‌, జడ్పీటీసీ పి.బుచ్చిబాబు తదితరులు పాల్గొన్నారు.


ఎమ్మెల్యే రెడ్డి శాంతిని నిలదీసిన నిర్వాసితులు

హిరమండలంలో శుక్రవారం వంశధార నిర్వాసితులకు అదనపు పరిహారం చెక్కుల పంపిణీ చేపట్టారు. కార్యక్రమం ముగిసన తర్వాత బయటకు వెళ్తున్న పాతట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతిని నిర్వాసితులు చుట్టుముట్టారు. గతంలో యూత్‌ ప్యాకేజీ ఇచ్చిన వారికే మళ్లీ ఇప్పుడు అదనపు పరిహారం ఇస్తున్నారని, అప్పట్లో తమకు పైసా కూడా అందేలేదని, అదనపు పరిహారంలోనైనా తమ పిల్లలను గుర్తించకపోవడం సరికాదని మండిపడ్డారు. సుమారు 2500 కుటుంబాల్లో యువత ఉన్నప్పటికీ పరిహారం అందించక పోవడం అన్యాయమన్నారు. నిర్వాసితులు చుట్టుముట్టడంతో పోలీసుల బందో బస్తు నడమ ఎమ్మెల్యేను అక్కడి నుంచి దాటించారు. 

Updated Date - 2022-06-25T05:37:07+05:30 IST