పల్లెప్రగతి’ని పకడ్బందీగా నిర్వహించాలి

ABN , First Publish Date - 2020-10-30T10:35:56+05:30 IST

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతి పనులను గ్రామాల్లోని ప్రజాప్రతినిధులు పకడ్బందీగా ని ర్వహించాలని అదనపు కలెక్టర్‌ లత అన్నారు.

పల్లెప్రగతి’ని పకడ్బందీగా నిర్వహించాలి

అదనపు కలెక్టర్‌ లత 


బోధన్‌రూరల్‌, అక్టోబరు 29 : ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతి పనులను గ్రామాల్లోని ప్రజాప్రతినిధులు పకడ్బందీగా ని ర్వహించాలని అదనపు కలెక్టర్‌ లత అన్నారు. గురువారం బోధన్‌ మండల పరిషత్‌ సమా వేశ మందిరంలో ఏర్పాటుచేసిన సర్పం చ్‌ల సమావేశంలో ఆమె మాట్లాడారు. మండలం లోని అన్ని గ్రామాల్లో ప్రగతి అభివృద్ధి పక డ్బందీగా చేప ట్టాలన్నారు. పల్లెప్రగతి పనుల్లో హరితహారం కార్యక్ర మాన్ని విజయవంతం చేయాలన్నారు. మొక్కలను నాటి వాటిని సం రక్షించే బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలని సూచించారు. చనిపోయిన మొక్కలను పరిశీలించి వాటి స్థానంలో మరో కొత్త మొక్క లను ఏర్పాటుచేయాలన్నారు. ప్రజాప్రతినిధులు తమ పని తీరు మెరుగుపర్చుకోవా ల న్నారు. సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. హరితహారంలో నిజామాబాద్‌ మొదటి స్థా నంలో ఉండాలన్నారు. అందులో బోధన్‌ మండలం విజ యవంతంగా పూర్తి చేయాలని సూచించారు. కార్యక్ర మంలో ఎంపీపీ సావిత్రిరాజేశ్వర్‌, ఎంపీడీవో సుదర్శన్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ సర్పం చ్‌లు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. 


గ్రామాల్లో పర్యటన

బోధన్‌ మండలంలోని రాజీవ్‌నగర్‌  తండా, ఊట్‌పల్లి, అ మ్దాపూర్‌ గ్రామాల్లో పల్లెప్రగతి పనులను జిల్లా అడిషినల్‌ కలెక్టర్‌ లత గురువారం పర్యటించి పరిశీలించారు. గ్రా మాల్లో నర్సరీలు ఏ విధంగా పని చేస్తున్నాయి. నర్సరీల లో ఏఏ మొక్కలు నాటారు. ఆయా గ్రామాల సర్పంచ్‌లను పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పల్లెప్రగతి కా ర్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచిం చారు. ఆమె వెంట ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీడీవో సుదర్శన్‌ తదితరులున్నారు. 

Updated Date - 2020-10-30T10:35:56+05:30 IST