దళితబంధుపై అదనపు కలెక్టర్‌ అవగాహన

ABN , First Publish Date - 2022-01-29T04:47:42+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న దళితబంధు పథకం ప్రతిష్ఠాత్మకమైనదని అదనపు కలెక్టర్‌ వీరారెడ్డి అన్నారు.

దళితబంధుపై అదనపు కలెక్టర్‌ అవగాహన

వట్‌పల్లి, జనవరి 28: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న దళితబంధు పథకం ప్రతిష్ఠాత్మకమైనదని అదనపు కలెక్టర్‌ వీరారెడ్డి అన్నారు. శుక్రవారం వట్‌పల్లి ఎంపీడీవో కార్యాలయంలో రికార్డులను పరిశీలించిన అనంతరం మండల పరిధిలోని బుడ్డాయిపల్లి గ్రామాలో దళితబంధు పథకం కోసం అధికారులు చేపట్టిన సర్వేను పరిశీలించారు. దళితబంధు పథకంపై లబ్ధిదారులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దళితబంధు పథకం పేదరికం నుంచి బయటపడేసేందుకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. అర్హులైన ప్రతీ దళిత కుటుంబానికి పథకం వర్తించేలా కృషి చేస్తున్నామన్నారు. అందులో భాగంగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోందన్నారు. శనివారం స్థానిక ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్‌, కలెక్టర్‌ హన్మంతరావు బుడ్డాయిపల్లి గ్రామంలో పర్యటిస్తారని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీవో యూసుఫ్‌, వరం సొసైటీ అధ్యక్షుడు వీరారెడ్డి, సర్పంచ్‌ పద్మారావు, ఎంపీటీసీ నవీన  పాల్గొన్నారు. 


 

Updated Date - 2022-01-29T04:47:42+05:30 IST