అంతర్జాల పద్యపఠన పోటీల విజేత అద్దంకి వనీజ

ABN , First Publish Date - 2020-09-10T15:12:56+05:30 IST

తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా వాగ్దేవి కళాపీఠం వారు నిర్వహించిన అంతర్జాతీయ అంతర్జాల పద్య పోటీల్లో డా. అద్దంకి శ్రీనివాస్ కుమార్తె వనీజ విజేతగా నిలిచింది.

అంతర్జాల పద్యపఠన పోటీల విజేత అద్దంకి వనీజ

తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా వాగ్దేవి కళాపీఠం వారు నిర్వహించిన అంతర్జాతీయ అంతర్జాల పద్య పోటీల్లో ప్రముఖ సాహితీవేత్త  డా. అద్దంకి శ్రీనివాస్ కుమార్తె వనీజ (8) విజేతగా నిలిచింది. ఆగస్టు 29,30, సెప్టెంబరు 6న జరిగిన ఈ క్యార్యక్రమంలో ‘తేజో మయం - తెలుగు పద్యం’ అనే శీర్షికతో తెలుగు పద్యాల ఉత్సవాన్ని నిర్వహించారు. ఈ ఉత్సవంలో దాదాపు 22 దేశాలకు చెందిన, 29 రాష్ట్రాల్లో నివసించే 1400 మందికి పైగా తెలుగు వారు పాల్గొన్నారు.  ఇందులో 3 ఏళ్ల నుంచి 90 ఏళ్లు దాటిన వృద్ధులు కూడా పాల్గొన్నారు. వీరిని 5 భాగాలుగా విభజించి, ఒక్కో విభాగానికి ఒక్కో మహాకవి పేరు పెట్టారు. ఆదికవి నన్నయ, తిక్కన, ఎర్రాప్రగడ, పోతన, శ్రీనాథుడు విభాగాలుగా నామకరణం చేసి పద్యాల పోటీని నిర్వహించారు. 


ఎస్పీ బాలు కోసం పాట పాడిన వనీజ


ఈ పోటీల్లో తెలుగువారు తక్కువగా ఉండే జపాన్, ఆస్ట్రేలియా, జాంబియా దేశాల్లోనివారు కూడా పాల్గొనడం విశేషం. 50 మంది సాహిత్యవేత్తలు, అవధానులు, కవులు, పండితులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  కాళోజీ నారాయణరావు గారి జయంతి సందర్భంగా సెప్టెంబర్ 9న సాయంత్రం 5గంటలకు సమాపనోత్సవ సభను ఏర్పాటు చేశారు. బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్, నందమూరి లక్ష్మీ పార్వతి, జయప్రకాశ్ నారాయణ, కె రామచంద్రమూర్తి, ఓలేటి పార్వతీశం, ఘట్టి కృష్ణమూర్తి, కోలవెన్ను మలయవాసిని, ఎన్.ఎస్ రాజు, పాండురంగ శర్మ, పరిమి రామ నరసింహం, అద్దంకి శ్రీనివాస్, పద్యానికి పట్టాభిషే కార్యనిర్వాహకులు అయిన శ్రీ వి. వి. ఎల్ శ్రీనివాస మూర్తి తదితర సాహిత్యవేత్తలు ఎందరో పాల్గొన్నారు.




ఈ కార్యక్రమంలో ముగ్గురు విశ్వవిద్యాలయం ప్రొఫసర్లు ఆచార్య కోలవెన్ను మలయవాసిని, ఆచార్య పరిమి రామనరసింహం, ఆచార్య ఎన్.ఎస్. రాజు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించి నన్నయ విభాగం నుంచి చిన్నారి అద్దంకి వనీజను ప్రథమ బహుమతి విజేతగా ఎంపికచేశారు. అలాగే ద్వితీయ బహుమతికి మామిళ్ళపల్లి ఆశ్రిత, తృతీయబహుమతికి ఎం. నాగ మనస్వినిని ఎంపిక చేశారు. ఇతర విభాగాలలో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులందుకున్నవారు....


తిక్కన విభాగంలో ప్రమద్వర జక్కు, అభినవ్ రిషి, శ్రీకర్

(ప్రత్యేక ప్రశంసగా... విష్ణుభట్ల కార్తీక్, పోల్లిసేటి అనర్గ్య)


ఎర్రన విభాగంలో కోటిపల్లి దామోదర్, సౌందర్య, సాకివార్ ప్రశాంత్ కుమార్


పోతన విభాగంలో దీక్ష, పొందూరు సుధాకుమార్, లావణ్య


శ్రీనాథ విభాగంలో కోర్నేపాటి విద్యాసాగర్, తంత్రవహి శ్రీరామమూర్తి, అవుగడ్డ అప్పలనాయుడు

(ప్రత్యేక ప్రశంసగా... ఎన్ కృష్ణయ్య, పిడివి ప్రసాద్ రావు, జేడిగుంట విజయం)

Updated Date - 2020-09-10T15:12:56+05:30 IST