మార్కింగ్‌ బారెడు..తొలగింపు మూరెడు..!

ABN , First Publish Date - 2021-06-18T06:25:41+05:30 IST

అద్దంకి పట్టణంలో ఆక్రమణల తొ లగింపు అనేక మలుపులు తిరుగుతోంది. నగర పంచా యతీ అధికారులు తొలుత నిర్ణయించిన దానికి భిన్నంగా రోడ్ల విస్తరణ పనులు జరుగుతున్నాయి. మార్కింగ్‌ బారె డు.. తొలగింపు మూరెడు అన్న విధంగా సాగుతున్నాయి.

మార్కింగ్‌ బారెడు..తొలగింపు మూరెడు..!
మెయిన్‌రోడ్డులో జరుగుతున్న విస్తరణ పనులు

అద్దంకిలో ఆక్రమణల తొలగింపు గందరగోళం

డివైడర్‌ ఏర్పాటు చేస్తే ట్రాఫిక్‌ సమస్య పెరిగే అవకాశం 


అద్దంకి, జూన్‌ 17 : అద్దంకి పట్టణంలో ఆక్రమణల తొ లగింపు అనేక మలుపులు తిరుగుతోంది. నగర పంచా యతీ అధికారులు తొలుత నిర్ణయించిన దానికి భిన్నంగా రోడ్ల విస్తరణ పనులు జరుగుతున్నాయి. మార్కింగ్‌ బారె డు.. తొలగింపు మూరెడు అన్న విధంగా సాగుతున్నాయి. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఆక్రమణలు పూర్తి స్థాయిలో తొలగించి సెంటర్‌ డివైడర్‌, సెంట్రల్‌ లైటింగ్‌తో పట్టణా న్ని సుందరీకరించాలన్న సంకల్పంతో  అధికారులు ముం దుకు సాగారు. అయితే ప్రస్తుతం మెయిన్‌ రోడ్డు (నగరపంచాయతీ కార్యాలయం రోడ్డు)లో జరుగుతున్న విస్తర ణ పనులను పరిశీలిస్తే లక్ష్యానికి అనుగుణంగా సాగడం లేదన్న విషయం తేటతెల్లమవుతోంది. మార్కింగ్‌ చేసిన దానికి తొలగింపునకు సంబంధం లేకుండా ఉంది. రెవె న్యూ రికార్డుల ప్రకారం మెయిన్‌ రోడ్డు పొట్టిశ్రీరాములు విగ్రహం వద్ద నుంచి పోలీస్‌ స్టేషన్‌ వరకూ 66 అడుగుల వెడల్పు ఉండాలి. అయితే 4 సంవత్సరాల క్రితం రో డ్డును విస్తరించిన సమయంలో 59 అడుగులకే పరిమి తం చేశారు. ప్రస్తుతం మరోసారి ఆక్రమణలకు తొలగిం పునకు సిద్ధమైన నగరపంచాయతీ అధికారులు 66 అడుగుల మేర రోడ్డు విస్తరించి సెంటర్‌ డివైడర్‌, సెంట్రల్‌ లై టింగ్‌ ఏర్పాటు చేయాలని భావించారు. అందుకు అనుగు ణంగా ఆయా ప్రాంతాల్లో మార్కింగ్‌ ఇచ్చారు. ఆ ప్రకా రం తొలగింపు చేపట్టకుండా గతంలో రోడ్డు విస్తరణ చేసి సైడ్‌ డ్రైన్‌ల నిర్మాణం చేపట్టిన వరకే పరిమితం చేస్తున్నారు. దీనివల్ల మరిన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉం దని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఉన్న రోడ్డులోనే సెంటర్‌ డివైడర్‌ ఏర్పాటు చేస్తే వాహనాల పార్కింగ్‌ సమస్య తలెత్తి ట్రాఫిక్‌కు ఇబ్బంది కలుగుతుందని  అంటున్నారు. రోడ్డు విస్తరణ పూర్తిస్థాయిలో చేయ ని పక్షంలో సెంటర్‌ డివైడర్‌ స్థానంలో రోడ్డు మధ్యలో మార్కింగ్‌ ఇచ్చి సెంటర్‌పార్కింగ్‌, సెంట్రల్‌ లైటింగ్‌ ఏర్పా టు ద్వారా కొంత మేర సమస్యకు పరిష్కారం లభిస్తుం దని  సూచిస్తున్నారు. నాలుగు సంవత్సరాల క్రితం ఒక సారి, మరలా ఇప్పుడు రోడ్డు విస్తరణ పేరుతో అధికారు లు హడావుడి చేయటం చూస్తే భవిష్యత్‌లో ఇంకోసారి కూడా ఇదే పరిస్థితి ఉంటుందేమోనన్న అనుమానాలను వ్యాపారులు వ్యక్తం చేస్తున్నారు. ఆక్రమణలు తొలగించిన ప్రతిసారీ కనీసం ఒక్కో దుకాణం ముందు సరిచేసుకోవటానికి రూ.25వేల ఖర్చు చేయాల్సి వస్తుందన్న ఆందోళన వారిలో వ్యక్తమవుతోంది.  


పలు ప్రాంతాల్లో అడ్డంకులు


పాత గాంధీబొమ్మ సెంటర్‌లో కూడా ఆక్రమణల తొలగింపు క్రమపద్ధతిలో కాకుండా కొన్నిచోట్ల తొలగించి, మరికొన్ని చోట్ల వదిలివేశారన్న విమర్శలు వస్తున్నాయి. నామ్‌ రోడ్డులో అంబేడ్కర్‌ బొమ్మ వద్ద నుంచి భవానీసెంటర్‌ వ రకూ ఆక్రమణల తొలగింపు చేపట్టగా మధ్యలో కొన్నిచోట్ల అడ్డంకులు తలెత్తాయి. ఏడెనిమిది మంది భవనాల యజమానులు కోర్టును ఆశ్రయించడంతో ఆయా ప్రాంతాల్లో రెవెన్యూ రికార్డుల ఆధారంగా విస్తరణ పనులు కుదించా ల్సి వచ్చిందని నగర పంచాయతీ అధికారులు చెప్తున్నా రు. ఇక విస్తరణ పనులు చేపట్టాల్సిన రామాటాకీస్‌ బ జారు, ఎస్‌బీఐ రోడ్డు, ఆయిల్‌ మిల్లు రోడ్లలో ఆక్రమణలు మరింత ఎక్కువగా ఉండి వాహనాల రాకపోకలకు ఇబ్బం ది ఎదురవుతోంది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఆక్ర మణలు తొలగిస్తారా లేక మెయిన్‌ రోడ్డులో సర్దుకుపో యిన విధంగానే మిగిలిన చోట్ల కూడా మొక్కుబడిగా  చే పడతారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

Updated Date - 2021-06-18T06:25:41+05:30 IST