Abn logo
Mar 3 2021 @ 00:00AM

పల్లె ప్రకృతి పనులు పూర్తి చేయాలి

ములుగు అడిషనల్‌ కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి

కన్నాయిగూడెం,మార్చి 3:  ఈ నెల 15 వరకు పల్లె ప్రకృతి పనులు పూర్తి చేయాలని ములుగు అడిషనల్‌ కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి అన్నారు. మండలంలోని ఎమ్మార్సీ భవనంలో బుధవారం ఎంపీడీవో బాబు అధ్యక్షతన జరిగిన పల్లె ప్రగతి పనులపై  ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.   ఈ సందర్భంగా మాట్లాడుతూ మండలంలోని వివిధ గ్రామ పంచాయతీల్లో పల్లె ప్రగతి పనులు పూర్తి కాకా పోవడంతో అసహనం వ్యక్తం చేశారు. అనంతరం గుర్రేవులలోని జడ్పీపాఠశాలను సందర్శించి ఉపాధ్యాయులతో మాట్లాడారు. కరోన తర్వాత పాఠశాలలు పునః ప్రారంభం కావటంతో విద్యార్థులు వస్తున్నారా, ? కోవిడ్‌ 19 నింబంధనలు పాటిస్తున్నారా? అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం చింతగూడెంలోని అంగన్‌వాడీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. కార్యక్రమాల్లో తహసీల్దార్‌ దేవాసింగ్‌,ఎంపీవో కుమార్‌,సర్పంచులు,కార్యదర్శులు  పాల్గొన్నారు.

Advertisement
Advertisement