ప్రత్యేక అలంకరణలో అడవి పేరంటాలమ్మ
ఉదయగిరి, జూన్ 30: మండలంలోని గన్నేపల్లి పంచాయతీలో వెలసిన అడవి పేరంటాలమ్మ నెలపొంగళ్లు గురువారం వైభవంగా నిర్వహించారు. ఆలయ చైర్మన్ మేడేపల్లి వెంకటయ్య ఆధ్వర్యంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. పంచాయతీ పరిధిలోని సర్వరాబాదు, కొట్టాలపల్లి, మిట్టపల్లి, బీసీ కాలనీ, గడ్డంవారిపల్లి, జెట్టివారిపల్లి గ్రామాల నుంచి భక్తులు తరలివచ్చి ఆలయ ఆవరణలో పొంగళ్లు నిర్వహించారు. అమ్మవారికి నైవేధ్యం చెల్లించి మొక్కులు తీర్చుకొన్నారు. సంతానం లేని భక్తులు వరపడ్డారు.