Abn logo
Jul 25 2021 @ 01:49AM

ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశానికి 160 మంది విద్యార్థుల ఎంపిక

మచిలీపట్నం టౌన్‌, జూలై 24 : జిల్లాలోని పెదకొమిర, మద్దులపర్వ ఆదర్శ పాఠశాలల్లో 6వ తరగతి ప్రవేశాలకు శనివారం డీఆర్వో ఎం.వెంకటేశ్వర్లు లాటరీ తీసి విద్యార్ధులను ఎంపిక చేశారు.  ప్రిన్సిపాల్స్‌, విద్యార్థుల తల్లిదండ్రుల సమక్షంలో  లాటరీ తీశారు. గంపలగూడెం మండలం పెదకొమెర మోడల్‌ స్కూల్‌లో ఆరవ తరగతి ప్రవేశానికి 80 సీట్లకు 178 మంది దరఖాస్తు చేసుకున్నారు. రెడ్డిగూడెం మండలం మద్దులపర్వ మోడల్‌ స్కూల్‌లో ఆరవ తరగతి ప్రవేశానికి 200 మంది దరఖాస్తు చేసుకున్నారు. లాటరీ తీసి రెండు పాఠశాలలకు 160 మంది విద్యార్ధులను ఎంపిక చేశారు. డీఈవో తాహెరా సుల్తానా, మోడల్‌ స్కూల్స్‌ ఏడి అవధాని, పరీక్షల అసిస్టెంట్‌ కమిషనర్‌ జి. శ్రీనివాసరావు, సూపరింటెండెంట్‌లు పి. వెంకటేశ్వరరావు, పవన్‌లు పాల్గొన్నారు.