మార్కెట్ క్యాప్‌లో ఎన్టీపీసీని బీట్ చేసిన Adani Power..

ABN , First Publish Date - 2022-08-19T17:00:26+05:30 IST

గౌతమ్ అదానీ నేతృత్వంలోని గ్రూప్ కంపెనీ షేరు ధర పరుగులు తీయడంతో అదానీ పవర్ మార్కెట్ క్యాప్ (Market Cap) ఓ రేంజ్‌కి ఎగిసింది.

మార్కెట్ క్యాప్‌లో ఎన్టీపీసీని బీట్ చేసిన Adani Power..

Adani Power : గౌతమ్ అదానీ నేతృత్వంలోని గ్రూప్ కంపెనీ షేరు ధర పరుగులు తీయడంతో అదానీ పవర్ మార్కెట్ క్యాప్ (Adani Power Market Cap) ఓ రేంజ్‌కి ఎగిసింది. ఇది ఎన్టీపీసీ(NTPC)ని సైతం అధిగమించింది. ఉదయం 09:38 గంటలకు అదానీ పవర్ రూ.160,4291 కోట్ల m-క్యాప్‌తో 35వ స్థానంలో నిలువగా, NTPC రూ. 154,710 కోట్ల మార్కెట్ క్యాప్‌తో మొత్తం ర్యాంకింగ్‌లో 37వ స్థానంలో నిలిచింది.


అదానీ పవర్ కూడా ఆటోమొబైల్ కంపెనీ మహీంద్రా అండ్ మహీంద్రా (M&M)ని అధిగమించింది. ఇది రూ.156,394 కోట్ల మార్కెట్-క్యాప్ కలిగి ఉంది. గత ఒక నెలలో ఎన్టీపీసీ మార్కెట్ ధరలో 6 శాతం లాభపడింది. అదానీ పవర్ స్టాక్ ధర 41 శాతం పెరిగింది. బెంచ్‌మార్క్ ఎస్‌అండ్‌పీ బీఎస్‌ఈ సెన్సెక్స్ అదే సమయంలో 10 శాతం ర్యాలీ చేసింది.


ఇప్పటివరకు 2022 క్యాలెండర్ సంవత్సరంలో ఎన్టీపీసీ 30 శాతం పెరిగింది. అదానీ పవర్ 318 శాతం జూమ్ చేసి మార్కెట్‌తో పోలిస్తే అవుట్ పెర్ఫార్మ్ చేసింది. ఈ కాలంలో ఎస్అండ్‌పీ బీఎస్ఈ సెన్సెక్స్ 1.9 శాతం పెరిగింది. భారత ప్రభుత్వం చేపట్టిన అనేక సంస్కరణలు భారత విద్యుత్ రంగాన్ని బలోపేతం చేశాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం క్యూ1లో కంపెనీ ఏకీకృత మొత్తం ఆదాయం గత ఏడాది ఇదే త్రైమాసికంలో ఆర్జించిన రూ. 7,213 కోట్ల నుంచి వార్షికంగా రెట్టింపు కంటే ఎక్కవ లేదా 115 శాతం పెరిగి రూ. 15,509 కోట్లకు చేరుకుంది.


Updated Date - 2022-08-19T17:00:26+05:30 IST